Revanth Reddy: కేసీఆర్ ముందు సరిగ్గా నిలబడు… మళ్లీ కొట్టుదువుగాని….. రీ కౌంటర్ ఇచ్చిన రేవంత్?

Revanth Reddy: బిఆర్ఎస్ నాయకుడు కెసిఆర్ మొదటిసారి తెలంగాణ సర్కార్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అంటూ కేసిఆర్ ఫైర్ అయ్యారు. ఇలా కేసీఆర్ తమ ప్రభుత్వం గురించి పాలన గురించి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఓడించి ఫామ్ హౌస్ కి పంపించిన కేసీఆర్ కు ఏ మాత్రం అహంకారం తగ్గలేదని తెలిపారు. ఫామ్ హౌస్ లో ఉండి స్టోరీలు చెప్పడం కాదు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో స్పష్టంగా వివరిస్తామని రేవంత్ తెలిపారు. 10 సంవత్సరాల పాటు ప్రజలు మీకు అధికారం ఇస్తే పందికొక్కుల్లా మిగిలిన బడ్జెట్ మొత్తం నొక్కేసారనీ, పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పడం వల్లే నేడు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని రేవంత్ తెలిపారు.

ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై అబద్ధాలు చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేశామని ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్‌ హయాంలో లాగా రాష్ట్రాన్ని దోచుకోవడం లేదని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన లైకులు చూసి కేసీఆర్ సంతోషపడుతున్నారని ఫైర్ అయ్యారు.

కెసిఆర్ చల్లని ఒక వేయ్యి రూపాయల నోటు లాంటి వ్యక్తి ఆ నోటు జేబులో ఉంటే జైలుకు వెళ్లాల్సిందేనని కేసీఆర్ పరిస్థితి కూడా అదేనని రేవంత్ తెలిపారు. అధికారం పోగానే ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలతో సంబంధాలు కూడా తెగిపోయాయని తెలిపారు. ప్రస్తుతం కెసిఆర్ సరిగా నిలబడే పరిస్థితి లేదు అలాంటిది బలంగా కొట్టే దమ్ము ఉందా? అలాంటి దమ్ము ఉంటే అసెంబ్లీకి రావాలి అంటూ ఈయన కెసిఆర్ కు రీ కౌంటర్ ఇచ్చారు.