తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. జనగామ దగ్గర్లోని కొడకండ్లలో ఆయన రైతు వేదికను ప్రారంభించారు. రైతు వేదికను ప్రారంభించిన అనంతరం.. సీఎం కేసీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో మొత్తం 38 లక్షలా 64 వేల 751 మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. అందులో.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 6 లక్షలా 95 వేల మందికే అని కేసీఆర్ స్పష్టం చేశారు. పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం సరికాదని ఆయన మండిపడ్డారు.
కేంద్రం ఒక పింఛనుదారుకు ఇచ్చేది 200 రూపాయలు మాత్రమే. కానీ.. ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం కేంద్రం 1600 ఇస్తోందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఒక్కరికి 2016 రూపాయలను అందిస్తోంది. పింఛను విషయంలో నేను చెప్పేది అబద్ధం అని బీజేపీ నేతలు నిరూపిస్తే.. నేను సీఎం పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధం.. అని సీఎం కేసీఆర్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
Live: CM Sri KCR addressing the farmers after inaugurating #RythuVedika at Kodakandla in Jangaon District. https://t.co/zZ0h6RdXuQ
— Telangana CMO (@TelanganaCMO) October 31, 2020