జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే దమ్ము కేసీఆర్ కు ఉందా!!

cm kcr anti channel in telangana

తెలంగాణలో ఎదురులేని రాజకీయ శక్తిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎదిగారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మెల్లమెల్లగా తన సుస్థిరమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఏ ఎన్నికలు వచ్చిన కూడా కేసీఆర్ గాని, టీఆర్ఎస్ నేతలు గాని గెలుపుకోసం కంటే కూడా , మెజారిటీ కోసం ప్రయత్నించేవారు. అసలు తెలంగాణలో ప్రజలకు టీఆర్ఎస్ తప్పా మరో ప్రత్యాన్మయం లేదన్నట్టుగా కేసీఆర్ తన హవాను తెలంగాణలో కొనసాగించారు. ఇదే నేపథ్యంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తమలో తాము కొట్టుకుంటూ కేసీఆర్ ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఇప్పుడు దుబ్బాక ఎన్నికలలో కేసీఆర్ కు బీజేపీ చేతిలో ఘోరమైన అవమానం జరిగింది.

kcr
kcr

టీఆర్ఎస్ కు ఘోరమైన అవమానం

దుబ్బాక నియోజక వర్గం టీఆర్ఎస్ కు కంచుకోటలాంటిది. ఈ స్థానంలో ఆల్రెడీ 2018 ఎన్నికల్లో రామలింగ రెడ్డి 62 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే ఈ నియోజక వర్గం పక్కన సిద్దిపేటలో హరీష్ రావ్, గజ్వెల్ లో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇంతమంచి బలం ఉన్న దుబ్బాకలో 2018 ఎన్నికల్లో కనీసం డిపాజిట్స్ కూడా రాని రఘునందన రావు 1470 ఓట్లతో గెలిచారంటే టీఆర్ఎస్ కు చాలా పెద్ద అవమానం. అయితే ఈ ఓటమికి తానే కారణమంటూ హరీష్ రావ్ బాధ్యత వహించారు. కానీ ఇన్నాళ్లు తెలంగాణలో పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన అనుకున్నారు కానీ ఇప్పుడు టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ అన్నట్టు మారింది. ఆల్రెడీ గెలిచిన స్థానాన్ని అధికారంలో ఉండి నిలుపుకోలేకపోవడం కేసీఆర్ యొక్క అసమర్థతే.

జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే దమ్ముందా!!

దుబ్బాక ఎన్నికల ఫలితాలను అందరూ ప్రభుత్వపనితీరుకు నిదర్శనమని భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే దమ్ముందా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే కరోనా సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపట్ల, వరదల సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల పట్ల హైదరాబాద్ ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. అలాగే దుబ్బాక ఎన్నికల ఫలితాల వల్ల బీజేపీ నాయకులు చాలా ఉత్సహంగా ఉన్నారు . ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారో లేదో వేచి చూడాలి.