తెలంగాణకు సీఎం కేసీఆర్ అనుకున్నట్లు గానే అసెంబ్లీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. అసెంబ్లీ వేదికగా 91,142 పోస్టులు భర్తీ చేయనున్నట్లు.. నేడు 80039 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.