మహేష్ ను మించిపోతున్న సీఎం జగన్

mahesh babu cm jagan

 మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా గుర్తుందా.. ఆ సినిమాలోని ఓ సీన్‌లో వాహనదారులకు సీఎం భరత్ విధించే ఫైన్‌లు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఏపీలో అంత స్థాయి జరిమానాలు కాదు గానీ.. దాదాపుగా భారీ జరిమానాలకు రంగం సిద్ధమైంది. వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ap government new traffic challan

 ఈ జీవో ప్రకారం.. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకూ ఒకే విధమైన జరిమానా విధించనున్నట్లు జగన్ సర్కార్ స్పష్టం చేసింది సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10000, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారికి రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750
సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750
అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000
అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000
డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000
రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000
వేగంగా బండి నడిపితే – రూ. 1000
సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000
రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000
పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000
ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000
ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000
అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా
రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినవారికి – రూ. లక్ష