మొదట్లో చిరంజీవి ఆ స్టార్ హీరో కూతురుతో చరణ్ పెళ్లి సెట్ చేశాడా..?

ఫిలిం ఇండస్ట్రీ లో సంభందాలు కలుపుకోవడం తరచూ చూస్తుంటాం. అక్కినేని నాగేశ్వర్ రావు, రామానాయుడు సంభంధం కలుపుకుని వియ్యంకులయ్యారు. కానీ, నాగార్జున, లక్ష్మి కొన్నాళ్ళకు విడాకులు తీసుకున్నారు.

అలాగే బాలకృష్ణ, తన కూతురుని మహేష్ బాబు కి ఇచ్చి పెళ్ళిచెయ్యాలి అనుకున్నాడని వార్తలు వచ్చాయి, కానీ అది జరగలేదు. అలాగే చిరంజీవి కూతురు, ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ కూడా అయ్యి పెళ్లి క్యాన్సల్ అయ్యింది.

రామ్ చ‌ర‌ణ్ కు మొద‌ట ఓ స్టార్ హీరో కూతురును ఇచ్చి వివాహం చేయాల‌ని చిరంజీవి అనుకున్నార‌ట‌. ఆ స్టార్ హీరో మ‌రెవ‌రో కాదు విక్ట‌రీ వెంక‌టేష్. ఇక ఇదే విష‌యాన్ని చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ కు చెప్పగా తాను ఉపాస‌న‌ను ప్రేమిస్తున్న‌ట్టు తెలిపాడ‌ట‌. దాంతో చిరంజీవి కొడుకు ఇష్టం మేర‌కు ఉపాస‌న‌తో చ‌ర‌ణ్ వివాహం జ‌రిపించారు.

ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉన్నారు. అలాగే వెంకటేష్ కూతురు కూడా పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉంది.