దిగ్గజ దర్శకుడి చేతులు మీదగా స్టార్ట్ అయ్యిన “భోళా శంకర్”

మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ ఇప్పుడు మామూలుగా లేదని చెప్పాలి. తన గత కాలంలో ఒకేసారి పలు సినిమాలు కంప్లీట్ చేస్తున్నట్టుగా మళ్ళీ ఒకదాని తర్వాత ఇంకొక సినిమాను చిరు ఓకే చేసే వాటిని కంప్లీట్ చేసెయ్యడం స్టార్ట్ చేశారు. అలా ఆల్రెడీ దర్శకుడు మోహన్ రాజాతో లూసిఫర్ సినిమాని స్టార్ట్ చేసేసిన మెగాస్టార్ ఈరోజు తన ఇంకో రీమేక్ “భోళా శంకర్” స్టార్ట్ చేసేసారు. మరి దీనిని వెరీ గ్రాండ్ గా ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు.

ఆల్ మోస్ట్ టాలీవుడ్ టాప్ దర్శకులు చిరు తో చేసిన వారు అంతా కూడా ఈ లాంచ్ కి హాజరు అయ్యారు. అంతే కాకుండా ఈ చిత్రం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్ర రావు గారు ఫస్ట్ క్లాప్ కొట్టడంతో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు సోదరి పాత్రలో నటిస్తుంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అనీల్ సుంకర నిర్మాణం వహిస్తున్నారు.