టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తమ తండ్రులతో దిగిన ఫోటోలను పంచుకుంటున్నారు.
ఇక చిరంజీవి కూడా తన తండ్రితో దిగిన ఫోటోను పంచుకుంటూ తన ఫాదర్ తో పాటు అందరి ఫాదర్స్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ఒక గొప్ప తనయుడుగా, గర్వించే తండ్రిగా అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాను అని ఒక ఎమోషనల్ నోటు పంచుకున్నాడు. ఇక ఈయనతో పాటు పలువురు స్టార్ హీరోలు కూడా తమ తండ్రులతో ఉన్న అనుబంధాలను పంచుకున్నారు.