Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు రాజకీయాలలోకి కూడా అడుగుపెడుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలలో ఉన్నత పదవులలో ఉన్న విషయం మనకు తెలిసిందే . అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ కంటే కూడా ముందుగా చిరంజీవి కూడా పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈయన ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించి ఎన్నికలలో పోటీ కూడా చేశారు కానీ అనుకున్న స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో చిరంజీవి తన పాటిని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కలిపేసిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.
ఇలా పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటికీ చిరంజీవి మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది అంటూ ఈయన మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలను జనసైనికులు కూడా స్వాగతించలేకపోయారు. ఇకపోతే తాజాగా బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మరోసారి తన రాజకీయాల గురించి మాట్లాడారు. గత కొంతకాలంగా చిరంజీవి సినిమా షూటింగ్స్ కూడా నిలిపివేసి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులతో భేటీ అవుతూ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈయన రాజకీయాలలోకి వస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలపై ఈయన స్పందిస్తూ… ఇకపై తాను రాజకీయాలలోకి అడుగుపెట్టనని జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఈ జీవితం మొత్తం కళామతల్లి సేవలో గడిపేస్తానని తెలిపారు.
తాను కొంతమంది రాజకీయ పెద్దలను కలుస్తున్న నేపథ్యంలో కొందరు రాజకీయాలలోకి రావడం కోసమే నేను వారిని కలుస్తున్నాను అంటూ అసత్య ప్రచారాలను చేస్తున్నారు. కానీ నేను వారిని కలిసేది సినీ రంగం కోసమేనని చిరంజీవి తెలిపారు. రాజకీయాలలో తన లక్ష్యాలు తన సేవా భావాన్ని కొనసాగించడానికి వాటిని నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటూ ఈ సందర్భంగా చిరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.