కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి కమల్ హాసన్ కు, ఆ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ పార్టీలో పాల్గొని కమల్ కు అభినందనలు తెలిపాడు.
ఇక చిరంజీవి ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అంతే కాకుండా కొన్ని ఫోటోలు కూడా పంచుకొని.. విక్రమ్ సినిమా మంచి సక్సెస్ అందుకున్నందుకు తమ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను అని అన్నాడు. ఈ ముగ్గురు అతిథుల రావడం తనకు సంతోషంగా ఉందని అన్నాడు. ఇక కమల్ హాసన్ కు ఈ సినిమా విజయం మరింత శక్తిని ఇస్తుంది అని అన్నాడు.