Chiranjeevi: మెగాస్టార్ ను పరామర్శించిన కేసీఆర్..?

Chiranjeevi: దేశవ్యాప్తంగా మరొకసారి కరోనా ప్రజలను వణికిస్తోంది. రోజు రోజుకీ కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కథ మళ్లీ మొదటికి వచ్చింది. రోజులో పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇకపోతే సామాన్యులతో పోల్చుకుంటే సెలబ్రిటీలే ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు.

ఇటీవల చిరంజీవికి స్వల్ప లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్ట్ చూపించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నాను అని చిరంజీవి ట్వీట్ ద్వారా వెల్లడించారు. గతంలో కూడా కరోనా మహమ్మారి బారిన పడిన చిరంజీవి త్వరగా కోలుకొని కరోనా బాధితులకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మరొకసారి కరోనా సోకడంతో అతని అభిమానులు, పలువురు సెలబ్రిటీలు త్వరగా కోలుకోవాలి అనే సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, త్వరలోనే మీ ముందుకు వస్తాను అని చిరంజీవి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. చిరంజీవి కూడా త్వరగా కోలుకోవాలి అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు చిరంజీవి త్వరగా కోలుకోవాలి అనే సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరంజీవి కి ఫోన్ చేసి చిరంజీవిని పరామర్శించారు. చిరు త్వరగా కోలుకోవాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇకపోతే చిరంజీవి నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా సోకడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి.