Sreeja: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చిన శ్రీజ తాజాగా తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో కూడా మనస్పర్థలు వచ్చాయని త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు మెగా కుటుంబం ఏ విధంగానూ స్పందించలేదు. ఇకపోతే తన భర్త నుంచి శ్రీజ దూరంగా ఉన్నప్పటికీ తన పిల్లలు మాత్రం తన వద్దే ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం శ్రీజ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఫోటో దిగి తన పిల్లలే తన ప్రపంచం అని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాలలో వైరల్ గా మారడంతో నిజంగానే కళ్యాణ్, శ్రీజ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఈ పోస్టు ద్వారా అనుమానాలు మరింత పెరిగాయి. ఇకపోతే తాజాగా శ్రీజ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కూతురితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత కొద్ది రోజుల నుంచి శ్రీజ గురించి వస్తున్న వార్తలతో తాను పూర్తిగా డిప్రెషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే సరదాగా తన కూతుర్లను తీసుకొని తమిళనాడులోని కోటగిరి హిల్స్‌కు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ శ్రీజ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు పలువురు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.