Chiranjeevi Daughter: చిరంజీవి పెద్ద కుమార్తె హీరోయిన్ గా నటించారని తెలుసా.. హీరో అతనేనా?

Chiranjeevi Daughter: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తర్వాత దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే హీరోయిన్గా మాత్రం మొదటిగా నిహారిక మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు.

యాంకర్ గారి నిహారిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు. అయితే ఈమె సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత తన భర్తకు విడాకులు ఇచ్చిన నిహారిక ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. అయితే హీరోయిన్ గా నిహారిక కంటే కూడా ముందుగా మరో మెగా వారసురాలు సుస్మిత కూడా ఇండస్ట్రీలోకి వచ్చారని తెలుస్తోంది. సుస్మితను హీరోయిన్ గా చూడాలని చిరంజీవి ఎంతో ఆశపడ్డారట అందుకు అనుగుణంగానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ సుస్మిత హీరో హీరోయిన్లుగా ఓ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు అయితే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత అనుకొని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఆగిపోవడంతో సుస్మితకు సినిమాలలో నటించాలన్న ఆసక్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తుంది అయితే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సుస్మిత అనంతరం కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ప్రస్తుతం గోల్డెన్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా మారారు. ప్రస్తుతం తన తండ్రి చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.