Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా ఒకే వేదికపై ఉంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు ముఖ్యంగా సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తరచుగా వెంకటేష్ బాలకృష్ణ చిరంజీవి వంటి వారు ఒకే వేదికపై సందడి చేస్తున్నారు కానీ నాగార్జున మాత్రం కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ముఖ్యంగా బాలకృష్ణ ఉంటే ఆ వేడుకలో చిరంజీవి కనిపించరు. ఒకవేళ చిరంజీవి వస్తే బాలయ్య ఆ కార్యక్రమానికి రారు. ఇలా పలు సందర్భాలలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అభిమానులు ఇలా వీరిద్దరూ దూరంగా ఉండటానికి గల కారణం ఏంటి వీరిద్దరి మధ్య దూరం పెంచిన అపార్థాలు ఏంటి అనే విషయంపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఈ హీరోల మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలుస్తుంది ఓ కార్యక్రమంలో భాగంగా నాగార్జున బాలకృష్ణను ఆ వేడుకకు ఆహ్వానించినప్పటికీ బాలకృష్ణ మాత్రం ఆ వేడుకకు రాలేదట అందుకే బాలకృష్ణ విషయంలో నాగార్జున దూరంగా ఉంటున్నారు ఇలా నాగార్జున దూరంగా ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ కూడా తనతో మాట్లాడటం లేదని తనకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
ఇకపోతే ఓ సినిమా వేడుకలో భాగంగా బాలకృష్ణ అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అంటూ కూడా మాట్లాడారు. ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఇక ఈ విషయంపై నాగచైతన్య కూడా ఘాటుగా స్పందించారు. ఇక ఇటీవల బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలందరూ కూడా స్పందించారు కానీ నాగార్జున మాత్రం బాలయ్యకు విష్ చేయకపోవడంతో వీరి మధ్య దూరం బాగా పెరిగిపోయిందని అభిమానులు భావిస్తున్నారు.
