ఢిల్లీ: నక్క జిత్తుల చైనా మరొక పన్నాగానికి పాల్పడుతున్నది. ఇండియా ని ఎదుర్కోటానికి గూఢచర్యాన్ని ఎన్నుకుంది. డోక్లాం మరియు గాల్వన్లలో సైనిక మొహరింపుకు సంభందించిన సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను పట్టుకొన్నారు. ఈ ముగ్గురులో ఒకరు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. చైనా ఇంటెలిజెన్స్కు సున్నితమైన సమాచారం అందించిన జర్నలిస్ట్ రాజీవ్ శర్మ ని స్పెషల్ సెల్ అర్రెస్ట్ చేసిందని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో చెప్పారు.
జర్నలిస్ట్ రాజీవ్ శర్మ ఒక సమాచారానికి 1000 డాలర్ల చొప్పున ఒక సంవత్సరం కాలంలో 40-45 లక్షలు అందుకున్నట్లు తెలిపారు. చైనాకి చెందిన క్వింగ్ షి, ఆమె నేపాల్ భాగస్వామి షేర్ సింగ్ అలియాజ్ రాజ్ బొహ్రాను కుడా పోలీసులు అర్రెస్ట్ చేసారు. వీరిద్దరూ హవాలా ద్వార శర్మకు మనీని చెల్లించారు.విచారణలో శర్మ నివేదికల రూపంలో అనేక పత్రాలను పంపించాడని మరియు ఈ పనికి గాను వారి వద్ద నుండి డబ్బు పొందాడని తన నేరాన్నీ ఒప్పుకున్నాడని పోలీస్లు తెలిపారు.