ఛత్రపతి చైల్డ్ ఆర్టిస్ట్ మనోజ్ జీవితంలో ఇన్ని కష్టాలా..?

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మనోజ్ ఆ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందాడు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన మనోజ్ హీరోగా కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాలలో నటించాడు అయితే హీరోగా మాత్రం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందలేకపోయాడు. అందువల్ల కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ ప్రస్తుతం మనోజ్ బిజీగా ఉన్నాడు. హీరోగా హిట్స్ అందుకో లేకపోయినా మనోజ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ తాజాగా తమిళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం అనే సినిమాలో కూడా నటించే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాలో మనోజ్ ఆర్మీ మాన్ గా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మనోజ్ తన సినీ జీవితంతో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన మనోజ్ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఈ ఇంటర్వ్యూలో మనోజ్ తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ.. 2015 వ సంవత్సరంలో తన తల్లి అనారోగ్యంతో మృతి చెందిందని అతడు వెల్లడించాడు. 2012వ సంవత్సరంలో తన తల్లికి క్యాన్సర్ వ్యాధి రావటంతో డబ్బులేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని మనోజ్ చెప్పుకొచ్చాడు.

అందువల్ల తన తల్లి వైద్యం కోసం అవసరమైన డబ్బు సంపాదించటానికి తనకి వచ్చిన అవకాశాలను ఒప్పుకున్నాడని మనోజ్ చెప్పుకొచ్చాడు.ఆ సమయంలోనే వ్యాపారంలో తన తండ్రీ కి నష్టాలు రావటంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమతమయ్యమని మనోజ్ చెప్పుకొచ్చాడు. కానీ అమ్మ ఆరోగ్యం కుదుటపడటానికి చాలా డబ్బులు ఖర్చు చేసి వైద్యం చేయించిన లాభం లేదని, 2015 లో తన తల్లి మరణించినట్టు మనోజ్ వెల్లడించాడు. ఇలా జీవితం లో ఎన్నో కష్టాలను అనుభవించిన మనోజ్ తనకు తానే దైర్యం చెప్పుకొని కష్టపడుతున్నాడు.