Viral news: ఒక్క క్షణంలో గుండె ఆగినంత పనైంది… పిల్లాడిపైకి దూకిన చిరుత.. వీడియో వైరల్

Viral news: నెట్టింట రోజు కొన్ని లక్షల వీడియోలు వస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఆ వీడియోలు ఫన్నీగానో, భయంగానే ఉంటాయి. సంథింగ్ ఢిపరెంట్ గా ఉండే వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలకు వ్యూయర్ షిప్ కూడా పెరుగుతూ ఉంటుంది.

సరిగ్గా అలాంటి వీడియోనే ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఫ్లోర్ పై  పాకుతున్న ఓ బుడ్డోడిని చిరుతపులి అమాంతం నోటకరుచుకుని వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ వీడియోను ఆ పిల్లాడి తండ్రి షూట్ చేసి ఇంటర్నెట్ లో వదిలాడు దీంతో.. ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ ఘటన బ్రిటన్ లోని వోర్సెస్టర్ షైర్ లో చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఓ పిల్లాడు ఒక వైల్డ్ లైప్ పార్కులోని ఓ గదిలో నెలపై పడుకుని మెల్లిగా పాకుతుంటాడు. అదే సమయంలో పిల్లాడిపై నజర్ వేసిన ఓ చిరుత పులి అమాంతం పిల్లాడిని ఎత్తుకెళ్లి విందుచేసుకుందాం అనుకుంది. అయితే ఒక్క ఉదుటన పిల్లాడిపైకి దూకింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. చిరుత పులికి, పిల్లాడికి మధ్య గాజు డోర్ క్లోజ్ అయి ఉందటంతో చిరుత చేసేదేం లేక తనదారిన వెళ్లిపోయింది.

తెగ వైరల్ అవుతున్న చిరుతపులి- చిన్న పిల్లాడి వీడియో:

ఈ సంఘటననంతా.. పిల్లాడి తండ్రి మిల్లర్ తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో విపరీతంగా షేర్ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటనను చూసిన నెటిజెన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఒక్కక్షణంలో పులి పిల్లాడిని ఎక్కడ చంపేసి తింటుందో అని తెగభయపడ్డామని… పులి దూకుడుకు గాజు కూడా అదిరిందని.. ఒకవేళ గాజు పగిలిపోతే అందరి ప్రాణాలకు ముప్పు వాటిల్లేదంటూ… కామెంట్లు చేస్తున్నారు.