Jr NTR, Ram Charan: భీమ్ పాత్రకు చరణ్ సరిపోడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయేంద్ర ప్రసాద్!

Jr NTR, Ram Charan: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రిలీజ్ అయ్యి 15రోజులు గడిచినా ఇంకా ఆ క్రేజ్ తగ్గట్లేదు. ఇప్పటికీ థియేటర్లలో మామూలు స్థాయిలో అయినా ప్రేక్షకుల తాకిడి కనిపిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు అగ్ర పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలే పలు రికార్డులను బ్రేక్ చేసింది. వారం రోజుల్లోనే దాదాపు రూ.650 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దీంతో రాజమౌళి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ప్రభంజనం సృష్టించారు. తారక్, చరణ్‌లకు కూడా ఈ సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెట్టింది.

ఇక ముందు నుంచే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు రాజమౌళి. దానికి తగ్గట్టుగానే వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేసి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ ఇంటర్వ్యూలతో ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్లా విజయ పతాకాన్ని ఎగురవేసింది. చాలా కొన్ని చోట్ల మాత్రం ఈ మూవీకి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అవేమీ కోట్లలో వసూలైన కలెక్షన్ల సునామీని ఆపలేకపోయాయి.

ఇదిలా ఇప్పుడున్న పలు సినీ రచయితల్లో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించే విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రస్తుతం విజయ దుంధుభి మోగించడంతో ఆయన మరింత గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ అయిన నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో చూసినట్టుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రకు సూట్ అవుతాడు, కానీ చరణ్ మాత్రం భీమ్ పాత్రకు సూట్ కాడంటూ ఆయన చెప్పుకొచ్చారు. కొంత మంది అభిమానులు ఇప్పటికే వారిద్దరి క్యారెక్టరూ రివర్స్‌గా చేసి ఉంటే బాగుంటుందేమో అన్న సందేహాలకు ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ సమాధానంగా మారాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్ సమయంలోనే దీనిపై చర్చలు జరిగాయన్న ఆయన, కళ్లకు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చే పాత్రకు చరణ్ సూట్ అవుతాడని, కానీ చరణ్‌లో మాత్రం భీమ్ పాత్రలో ఉండే మొరటుతనం లేదని ఆయన వివరించారు.