Charan and NTR : చరణ్, ఎన్టీయార్ కాంబినేషన్‌లో రాజమౌళి ఇంకో సినిమా.?

Charan and NTR :  వెండితెరపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కలిసి ఒకసారి కనిపిస్తేనే థియేటర్లు దద్దరిల్లిపోయాయ్. అలాంటిది, ఈ ఇద్దరూ ఇంకోసారి వెండితెరపై కలిసి కనిపిస్తే.? అది కూడా రాజమౌళి దర్శకత్వంలోనే రూపొందే సినిమాలో అయితే.! ఆ కిక్కే వేరప్పా.!

ఇది ఇప్పట్లో సాధ్యమేనా.? అన్న అనుమానాల్ని పక్కన పెడితే, అసాధ్యమేమీ కాదిది. ఎందుకంటే, సినీ పరిశ్రమలో కాంబినేషన్లు అనుకోకుండా సెట్టవుతాయి. అబ్బే, అదసలు సాధ్యం కాదనుకున్న సందర్భాలు కాస్తా.. ఎందుకు సాధ్యం కాదు.? అన్న కోణంలో మారిపోతాయ్.

ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం చూస్తే, అతి త్వరలోనే మరోమారు చరణ్, ఎన్టీయార్ తెరపై.. అదీ రాజమౌళి దర్శకత్వంలోనే కనిపించవచ్చునట. ఇందుకోసం ‘ఆర్ఆర్ఆర్’ సమయంలోనే చర్చ కూడా జరిగిందట.

‘ఆర్ఆర్ఆర్’ తరహాలో కాకుండా, ఇంకో ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్.. అందునా న్యూ ఏజ్ ఫిలిం ఈ ముగ్గురి నుంచీ రాబోతోందని సమాచారం.

రాజమౌళి సినిమాల్ని తెరకెక్కించడానికి చాలా సమయం తీసుకుంటాడు. మహేష్‌తో తన తదుపరి సినిమా చేయాల్సి వుంది. అదు పూర్తయ్యేటప్పటికే చాలా సమయం పట్టొచ్చు. ఏమో, రాజమౌళి.. మహేష్ సినిమాని వేగంగా పూర్తి చేసేస్తే.. ఆ తర్వాత చరణ్ – ఎన్టీయార్‌లను మళ్ళీ పట్టుకుంటే.. జస్ట్ వావ్.! అంతే.