సీఎం కేసీఆర్ ప్రసంగాలు అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అవును.. ఆయన ఎంత సేపు మాట్లాడినా అలా వింటూ కూర్చోవాలని ఉంటుంది. ఆయన మాటలు అలా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఎక్కడ ప్రసంగించినా.. ఆ ప్రసంగానికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన గంటలు గంటలు మాట్లాడరు. మాట్లాడిన కొంత సేపు అయినా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుతారు.
అయితే.. తాజాగా సీఎం కేసీఆర్ లో చాలా మార్పు కనిపించింది.. అంటూ వార్తలు వస్తున్నాయి. ఏ విషయంలో మార్పు కనిపించింది అంటారా? అదేనండి.. కేసీఆర్ నిన్న సిద్దిపేట జిల్లాలో పర్యటించారు కదా. అక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐటీ హబ్ ను ప్రారంభించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఇంకా చాలా హామీలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఎక్కువగా ప్రతిపక్షాల జోలికి పోకుండా… కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించే చెప్పారు.,
సాధారణంగా… కేసీఆర్ స్పీచ్ లో పంచ్ డైలాగులు ఉంటాయి. ప్రతిపక్షాలను ఉతికి ఆరేయడం ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి.. కానీ.. ఈసారి మాత్రం అవేమీ లేకుండా.. చాలా సింపుల్ గా కేసీఆర్ ప్రసంగాన్ని ముగించడంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చ సాగుతోంది.
మొన్న దుబ్బాక ఉపఎన్నిక, నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఈ రెండింట్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నట్టు అర్థం అవుతోంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమై.. ఇప్పటికే దిద్దుబాటు చర్యలను చేపట్టింది. అందుకే.. కేసీఆర్ కూడా ఎక్కడా తొందర పడకుండా.. కాస్త జాగ్రత్తగా ఈసారి మాట్లాడినట్టుగా తెలుస్తోంది.