ఇంతటి గందరగోళంలో కూడ ఆయన ప్రభాస్ కోసం ట్రై చేస్తున్నాడు

chandrasekhar-yeleti-writing-story-for-prabhas
chandrasekhar-yeleti-writing-story-for-prabhas
ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటున్నాయి.  కనీసం 250 కోట్ల బడ్జెట్ ఉండాలి.  అందుకే ఆయనతో సినిమాలు చేయాలనుకునే దర్శకులు జాతీయ స్థాయిలో మెప్పించగలిగే కథలనే రాసుకుంటున్నారు.  ఇప్పటికే ప్రభాస్ జాబితాలో చాలామంది దర్శకులున్నారు.  వారిలో నాగ్ అశ్విన్ సినిమా వరకు క్లారిటీ ఉంది కానీ తర్వాత దర్శకులు ఎవరి గురించీ స్పష్టత లేదు.  ఒక్క మాటలో చెప్పాలంటే అందరి సినిమాలు డైలామలోనే ఉన్నాయి.  ఇంతటి డైలమాలో కూడ ఒక దర్శకుడు ప్రభాస్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.  ఆయనే చంద్రశేఖర్ ఏలేటి.  
 
ఈయన రెబల్ స్టార్ కోసం పాన్ ఇండియా కథ ఒకటి రాస్తున్నారట.  కథ పూర్తవగానే ప్రభాస్ కు వినిపించి ఆయన ఓకే అంటే ఎన్నాళ్లయినా ఎదురుచూడటానికి సిద్ధంగా ఉన్నారట.  మరి ఆయన కథను ప్రభాస్ అంగీకరిస్తారో లేదో చూడాలి. ఇక ఏలేటి విషయానికొస్తే చేసే ప్రతి కథలోనూ ఏదో ఒక కొత్తదనం, అడ్వెంచర్ ఉండాలని తపన పడుతుంటారు.  అందుకే ఆయనకు వరుస ఫ్లాపులు వచ్చినా ఆయన మీద ప్రేక్షకుల్లో ఒకరకమైన నమ్మకం అయితే ఉంది.  అందుకే ఆయన ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తున్నారు అనగానే అందరిలోనూ ఉత్సుకత మొదలైంది.