విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన దేశ్యాప్తంగా ఎంత సంలచనమైందో తెలిసిందే. భోపాల్ గ్యాస్ ఘటన తర్వాత అత్యంత ప్రమాదకర ఘటనగా విశాఖ ఇన్సిడెంట్ చరిత్రకెక్కింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అండ్ కో పెద్ద ఎత్తున రాజకీయం చేసే ప్రయత్నం చేసారు. మీడియా సాక్షిగా వైకాపా ప్రభుత్వం తప్పిందంగానే ఘటన జరిగిందని ఆరోపించారు. ఎల్ జీ పాలిమర్స్ నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్యాకేజీలు ముట్టాయని ఆరోపించారు. సీఎం జగన్ బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వడం వెనుక కంపెనీ ఉందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. అయితే చంద్రబాబు ఈ విషయంపై రాజకీయం చేయడం ఒక్కసారిగా మానుకున్నారు.
ఇప్పటివరకూ బాధితుల్ని పరామర్శించింది లేదు. ఈ మధ్యనే ఓ లేఖ రాసి వైకాపా ప్రభుత్వం తమని విశాఖకు రానివ్వడం లేదని ఓ లేఖ రాసారు. అలాగే 50 వేలు పార్టీ తరుపున బాధిత కుటుంబాలకు అకౌంట్ లో వేస్తున్నట్లు తెలిపారు. మరి ఈ విషయంలో చంద్రబాబు, అండ్ పచ్చ మీడియా ఎందుకు ఒక్కసారిగా సైలైంట్ అయినట్లు అంటే ఆసక్తికర ప్రచారమే జరుగుతోంది. ఈ విషయంలో వేలు పెట్టోద్దని చంద్రబాబుకు కేంద్రం నుంచి హెచ్చరికలు వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన అంశం. అనవసరం యాగీ చేసి లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టుకోవద్దని నేరుగా రాజధాని ఢిల్లీ నుంచే చంద్రబాబు అండ్ కోకి హెచ్చరికలు వెళ్లినట్లు వినిపిస్తోంది.
ఆ కారణంగా చంద్రబాబు బాధితుల్ని కూడా పరామర్శించలేదని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తు చేయాలి. జగన్ సర్కార్ పై జనసేనతో కలిసి విమర్శించే ఏపీ బీజేపీ కూడా ఈ విషయంలో మొదటి నుంచి సైలెంట్ గానే ఉంది. చనిపోయిన బాధిత కుటుంబాలకు జగన్ సర్కార్ కోటి పరిహారం ఇవ్వడం చాలా గొప్పవిషయమని ప్రశంసించడం జరిగింది. దీనిపై మిగతా పార్టీలు చేసినంత రచ్చ బీజేపీ చేయలేదు. దీనంతంటికీ కారణంగా అదిష్టానం ఆదేశమేనని అందుకే ఏపీ బీజీపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు మౌనంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.