2019 ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఇప్పుడు పతనావస్థకు చేరువలో ఉంది. ఇప్పుడు ఆ అపార్టీని కాపాడటానికి ఒక కొత్త శక్తి రావాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో టీడీపీని తానే కాపాడుతానని లోకేష్ అంటున్నట్టు టీడీపీ నాయకులు చెప్తున్నారు. 2019 ఎన్నికల వరకు నారా లోకేష్ ను రాజకీయాల్లో ఎవ్వరు సీరియస్ గా తీసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు లోకేష్ యొక్క దూకుడును చూసి ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా భయపడుతున్నారు. లోకేష్ ను రాజకీయంగా బలపరచడానికి బాబు ప్రత్యేకమైన వ్యూహం రచిస్తున్నారు.
లోకేష్ రాజకీయం- బాబు వ్యూహం
రానున్న రోజుల్లో టీడీపీని నడిపించే నాయకుడిగా లోకేష్ ను తయారు చెయ్యడానికి చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నారు. ఒక నాయకుడిగా పార్టీని ఎలా నడిపించాలో లోకేష్ కు నేర్పించే పనిలో బాబు ఒక టీం ను ఏర్పాటు చేశారు. లోకేష్ దూకుడు చంద్రబాబును సైతం మించిపోయిందని అంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు. ప్రస్తుతం లోకేష్ దూకుడు భవిష్యత్ రాజకీయ పరిణామాలు అనే అంశంపై చంద్రబాబు సూచనల మేరకు యనమల రామకృష్ణుడు, సహా కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరాలు రిపోర్టు తయారు చేస్తున్నారట. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనని అంటున్నారు. పొలిటికల్ డేటా బేస్‌లో లోకేష్ హీరోగా మెరిసేందుకు అవసరమైన సూచనలు సలహాలు వీరు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
లోకేష్ పార్టీని నడిపించగలడా!!
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోలేదు. కానీ ఇప్పుడు పార్టీని నడిపించే బాధ్యతను చంద్రబాబు నాయుడు లోకేష్ పై పెడుతున్నారు. ఈ భాధ్యతను లోకేష్ ఎంతవరకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి. ఈ మధ్య కాలంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విధానం చూస్తుంటే రానున్న రోజుల్లో వైసీపీకి లోకేష్ వల్ల కష్టాలు రానున్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.