కాంగ్రెస్ కు చంద్రబాబు మార్క్ ఝలక్

chandrababu naidu uttam kumar reddy

 దుబ్బాక ఉప ఎన్నికలను అక్కడి ప్రధాన పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోని ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో వుంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు బాబు చిన్నపాటి ఝలక్ ఇచ్చాడనే చెప్పాలి. కొత్తగా తెలంగాణలో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. మరోసారి రమణకు తెలంగాణ టీడీపీ పగ్గాలు ఇచ్చాడు.

L ramana telugu rajyam

. ఈ సమయంలో రమణ మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని, 2018 వరకు మాత్రమే తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం తప్పితే, ఇప్పుడు కాదు. GHMC,ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము సొంతంగానే పోటీచేస్తామని చెప్పాడు. గతంలో చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా 2018 లో టీడీపీ కి బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల్లో పోటీచేశాడు. దీనినే కేసీఆర్ తన ప్రచార ఆయుధంగా వాడుకొని కాంగ్రెస్, టీడీపీ ని ఘోరంగా ఓడించాడు. టీడీపీ తో పొత్తు లేకపోతే కొద్దోగొప్పో ఎక్కువ సీట్లు సంపాదించేవాళ్లమని ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు.

అదే తప్పు ఈ ఎన్నికల్లో చేయకూడదని నిర్ణయించున్న కాంగ్రెస్ పార్టీ టీడీపీ తో బహిరంగంగా ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు. కాకపోతే అంతంతమాత్రంగా వుండే టీడీపీ సానుభూతి పరులు ఓట్లు సంపాదించాలని తెరవెనక పొత్తు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఆ విధంగా జరిగితే అటు బీజేపీ కి ఇటు తెరాస కి తాము వ్యతిరేకమవుతామని భావించిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో మాకు పొత్తులేదని రమణతో ప్రకటించటం వలన టీడీపీ ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ అనుగ్రహం కోసం ఎదురుస్తున్న బాబు దుబ్బాకలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే బీజేపీ ఇంకా దూరం అవుతుందని భావించి, వాళ్లతో మాకు పొత్తులేదని ప్రకటించాడు. టీడీపీ కి వున్నా కొద్దోగొప్పో ఓట్లు తమకు హెల్ప్ అవుతాయని భావించిన కాంగ్రెస్ నేతలు బాబు అవకాశవాద ధోరణిని చూసి షాక్ అవుతున్నారు… ఏదేమైనా చంద్రబాబుతో అంత ఈజీ కాదు..