వాళ్ళిద్దరూ సీమ కి తోపుగాళ్ళు , బట్ రాష్ట్రానికి పిచ్చ లైట్ ? 

TDP

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ పరిస్దితి రోజు రోజుకు మరింతగా దిగజారిపోతుంది అని అనుకుంటున్నారట.. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ లోని ముఖ్యమైన నాయకులందరు దాదాపుగా వైసీపీ బాటపడ్డారు.. ఇలాంటి పరిస్దితుల్లో ఒకప్పుడు బ్రేకులు లేకుండా దూసుకెళ్లిన సైకిల్ ఇప్పుడు పంక్చర్ అయ్యి ఒక మూలన పడబోతుందనే వార్తలు ఊపందుకుంటున్నాయి.. ఇక తాజాగా పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప‌ర్వం పూర్తయిన నేపధ్యంలో ఒక ఆస‌క్తిక‌ర చర్చ తెర‌మీదికి వ‌చ్చింది. . అదేమంటే చంద్రబాబు ముఖ్యమైన నేత‌ల‌తోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు న్యాయం చేశార‌ని అనుకుంటుండగా, కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీకి అంకిత‌మైవున్న నాయ‌కుల‌ను, కుటుంబాల‌ను ఈ ప‌ద‌వులకు ఎంపిక చేయ‌క‌పోవ‌డం పై మాత్రం జిల్లాల వారీగా ఉన్నవారు అసంతృప్తికి లోనవుతున్నారట..

ముఖ్యంగా సీమలో గొప్ప పేరున్న వారిలో ప‌రిటాల కుటుంబం ఇప్పటి వరకు టీడీపీనే నమ్ముకుని ఆ పార్టీకి ఎంతో సేవను అందించాయి.. కానీ వీరి విషయంలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుంది.. ఇకపోతే అనంత‌పురం జిల్లానుండి ప‌రిటాల కుటుంబం ఆది నుంచి టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉంది. అయితే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పరిటాల శ్రీరాం రెండు టికెట్లు అడిగితే.. చంద్రబాబు రాప్తాడు ఒక్కటే ఇచ్చారట. ఇక ఆ ఎన్నికల్లో శ్రీరాం ఓడిపోయారు. కాగా అప్పటి నుండి చంద్రబాబు ఈ కుటుంబాన్ని ప‌ట్టించుకోవడం లేదు. అందుకే ఈ కుటుంబం టీడీపీకి దూరం దూరంగా ఉంటుందట..

ఇక 2014 ఎన్నిక‌ల‌కు ముందు మాత్రమే టీడీపీలో చేరిన జేసీ ఫ్యామిలీకి 2014 ఎన్నిక‌ల్లో రెండు టికెట్లు ఇచ్చారు. ఈ విషయంలో పరిటాల కుటుంబం ఆగ్రహంతోనే ఉందని అంటున్నారు. కాగా ప్రస్తుతం పార్లమెంట‌రీ జిల్లాల క‌మిటీలు ఏర్పాటు చేస్తున్నారు క‌నుక మాజీ మంత్రి ప‌రిటాల సునీత త‌న‌కు త‌ప్పకుండా న్యాయం జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. కానీ ప‌రిటాల శ్రీరామ్‌కు చంద్రబాబు ఎలాంటి ప‌ద‌వి ఇవ్వలేదు.. ఇదే పరిస్దితి జేసీ కుటుంబానికి కూడా ఎదురవుతుంది.. ఇక ఇటీవ‌ల కాలంలో కేసుల్లో చిక్కుకున్న ఈ కుటుంబం వైపు చంద్రబాబు కన్నెత్తి కూడా చూడలేదనే అసంతృప్తి ఉండగా, కనీసం పార్లమెంట‌రీ జిల్లాల క‌మిటీల విషయంలోనైనా స్పందిస్తారని ఆశించారట.. కానీ, తాజాగా తీసుకున్న నిర్ణయంలో ఈ రెండు కుటుంబాల‌ను కూడా చంద్రబాబు ప‌క్కన పెట్టడంతో ప్రస్తుత కర్తవ్యం ఏంటనే ఆలోచనలో ఈ రెండు ఫ్యామిలీలు ఉన్నాయంటున్నారు..