Gallery

Home Andhra Pradesh ముందు నుయ్యి...వెనుక గొయ్యి మ‌ధ్య‌లో బాబు

ముందు నుయ్యి…వెనుక గొయ్యి మ‌ధ్య‌లో బాబు

శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నీటి త‌ర‌లింపు పై వైకాపా ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న స్టాండ్ ఏంటో చెప్ప‌మ‌ని చంద్ర‌బాబు నాయుడిని షంటేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కు కృష్ణా నీటి త‌ర‌లింపు జ‌రిగితే రాయ‌లసీమ స‌హా నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు తాగు నీటి క‌ష్టాలు త‌గ్గుతాయని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. దీంతో కృష్ణా జ‌లాల విష‌యంలో ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వానికి పూర్తి స‌పోర్ట్ ఉంది. క‌చ్చితంగా ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ‌కు నీరు త‌ర‌లించేల్సిందేన‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ కూడా కుండ బ‌ద్ద‌లు కొట్టేసారు. మీరేం చేస్తారో తెలియ‌దు…రాయ‌ల‌సీమ‌కు మాత్రం నీళ్లు తెచ్చే బాధ్య‌త మీదేనంటూ తెగేసి చెప్పేసారు.

ఈ జ‌లాల త‌ర‌లింపు విష‌యంలో గ‌తంలో తాము కూడా ప్ర‌య‌త్నం చేసామ‌ని గుర్తు చేసారు. ఇక బ్యాలెన్స్ ప్ర‌ధాన ప్ర‌త‌ప‌క్షంగా ఉన్న ఏపీ టీడీపీ అధినాయ‌కుడు చంద్ర‌బాబు మాత్ర‌మే స్పందిచాల్సి ఉంది. ఇప్ప‌టికే ఆయ‌న స్టాండ్ ఏంటో బ‌హిర్గ‌తం చేయాల‌ని వైకాపా నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. రోజుకొక నాయ‌కుడు చొప్పున వైకాపా వాళ్లు బాబు ప‌నితీరును ఎండ‌గ‌డుతున్నారు. కానీ బాబుగారు మాత్రం ఈ విష‌యంలో మౌనాన్ని వ‌హిస్తున్నారు. ఏపీకి స‌పోర్ట్ చేస్తే ప‌క్క‌నున్న తెలంగాణ రాష్ర్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒంటి కాలుపై లేచిప‌డ‌తారు. చంద్ర‌బాబు అరాచ‌కాల చిట్టా మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది.

అలాగ‌ని తెలంగాణ‌కి మ‌ద్ద‌తిస్తే ఏపీ ప్ర‌జ‌లు స‌హా ప్ర‌భుత్వం దుయ్య‌బెడుతుంది. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు క‌త్తులు నూరుతారు. చిత్తూరు జిల్లా కుప్పం బిడ్డ‌వై ఇక్క‌డి ప్ర‌జ‌ల గొంతు ఎండ బెడ‌తావా? అని ప్ర‌తి దాడికి దిగుతారు. దీంతో చంద్ర‌బాబు ప‌రిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా త‌యారైంది. గుడిని గుడిలో లింగాన్ని మింగేయాల‌ని చూస్తే ఇలాగే ఉంటుంది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ర్టం ఏర్పాటైన అక్క‌డా టీడీపీ పార్టీతో చక్రం తిప్పాల‌ని బాబుగారు గ‌త‌ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఘోరంగా చేతులు కాల్చుకున్నారు. ఫ‌లితంగా కేసీఆర్ తో అక్షింత‌లు వేయించుకున్నాడు. అలా తెలంగాణ ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబు ఓ ద్రోహిగా ముద్ర వేసుకున్నాడు. ఇటు ఏపీలో అధికారం స‌హా డిపాజిట్లు కోల్పోవ‌డంతో టీడీపీ బ్రాండ్ వ్యాల్యు ప‌డిపోయింది. మొత్తానికి నాలుగు ద‌శాబ్ధాల చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వం ఇప్పుడు శూన్యంగానే క‌నిపిస్తుంది.

- Advertisement -

Related Posts

ప్రచారం సరిపోదు.. నేరస్తులపై సీరియస్ ‘యాక్షన్’ వుండాల్సిందే

ఆంధ్రపదేశ్ రాజధాని (వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించకపోయినా) అమరావతి పరిధిలో అత్యంత హేయమైన ఘటన జరిగింది. ఓ యువతిపై, ఆమెకు కాబోయే భర్త సమక్షంలోనే లైంగిక దాడి జరిగింది. అదీ, అమరావతిలో.....

బ్లాక్ ఫంగస్: కేసీయార్ సారూ.. అదసలు వుందా.? లేదా.?

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ గురించి చాలా భయాలు చూశాం. చాలామంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇంకా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు...

కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాదైనా ఎన్టీవీ ‘కోటి దీపోత్సవం’ జరిగేనా..?

ప్రముఖ వార్తా చానెల్ ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా వేలమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సంస్థకే చెందిన భక్తి చానెల్...

Latest News