Ambika Krishna: వివి.వినాయక్, రాఘవేందర్ రావు గారు రోజూ ఫోన్ చేసి, చంద్రబాబు గారిని కలుద్దాం తీసుకెళ్తాం అని వీరందరి ఒత్తిడికి తాను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లానని నిర్మాత అంబికా కృష్ణ అన్నారు. తన జీవితంలో అదే మొదటిసారి ఒక సీఎంతో ఇలా ఎదురుగా కూర్చొని మాట్లాడడం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే మీరు సినీ ఇండస్ట్రీలో బాగా డెవలప్ చేశారు. మీలాంటి వాళ్లే నాక్కావాలి. మీరు పాలిటిక్స్‌లోకి ఎప్పుడు వస్తారు ? నేను మీకు టికెట్ ఇస్తాను. పోటీ చేయండి అని చంద్రబాబు తనని అడిగినట్టు ఆయన తెలిపారు. ఆయన చెప్పారు కాబట్టి తాను కూడా ఓకే అన్నానని ఆయన అన్నారు. అలా తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన వివరించారు.
ఆ తర్వాత తాను పోటీ చేశానని, గెలిచానని కూడా అని ఆయన చెప్పారు. 2004వరకు MLAగా ఉన్నానని, ఆ తర్వాత మాత్రం తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇవ్వకుండా ఈ సారి బీసీలకు ఇద్దామనుకుంటున్నట్టు తనతో చెప్పినట్టు ఆయన తెలిపారు. ఆయన మాట మీద గౌరవంతో అలా ఊరుకున్నానని, ఆ తర్వాత 2009లో టికెట్ ఇచ్చారు. కానీ తాను ఓడిపోయానని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా 2014లో తనకు MLC టికెట్ తప్పకుండా ఇస్తానని తనతో చెప్పారని అంబికా కృష్ణ తెలిపారు. అదే విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో అందరి ముందు కూడా చెప్పారని అన్నారు. ఇన్ని రకాలుగా చెప్పారు గానీ తనకు మాత్రం ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. తన ఏరియాలో ఉన్నవారికి మాత్రం రెండోసారి కూడా టికెట్ ఇచ్చారని, తనకు మాత్రం ఇవ్వలేదని, అది తనకు అగౌరవంగా అనిపించిందని అంబికా కృష్ణ అన్నారు. అందరూ తనని ఆ విషయంపై అడిగేసరికా తనకు చాలా బాధేసిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ మోసాన్ని తాను భరించలేకపోయానని ఆయన వివరించారు.