Chandra Bose: సినీ ఇండస్ట్రీలో పాటల రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో చంద్రబోస్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలను ప్రేక్షకులకు అందించారు. ఇక ఇటీవల నాటు నాటు పాటకు గాను ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబోస్ తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ అనంతరం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రాజకీయాలలో కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఈయన నేడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబోస్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు నాకు ఏదో కొత్త ఆక్సిజన్ లభిస్తుంది. నేను ఎప్పుడైనా ఇది చేయగలనా అంటూ నాపై నాకు సందేహాలు వచ్చినప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటానని చంద్రబోస్ తెలిపారు. ఆయన రాజకీయ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. బలమైన సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అనడానికి నిదర్శనం ఆయన. ఒక వ్యక్తి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా, రాజకీయాల నుంచి తప్పుకోకుండా ఎంతో సంకల్ప బలంతో దృఢంగా అవమానాలను ఎదుర్కొంటు నిలబడ్డారు.
తాను నిలబడడమే కాకుండా, రాష్ట్రం నుండి సెంట్రల్ వరకు అందరినీ నిలబెట్టే స్థాయికి ఎదిగి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు. అందుకే నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు నాపై నమ్మకం లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తలుచుకొని ముందడుగు వేస్తూ ఉంటాను అంటూ చంద్రబోస్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.