గతంలో జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలు రచించటానికి బీహార్ కి చెందిన ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నప్పుడు వాళ్ళని బీహార్ దోపిడీ ముఠాగా చంద్రబాబు నాయుడుఅవమానించాడు. ఇప్పుడు అదే ముఠాలో కీలకంగా వ్యవహరించిన రాబిన్ శర్మ ను టీడీపీ రాజకీయ వ్యూహ కర్తగా నియమించుకున్నాడు. అప్పుడు దోపిడీ ముఠాగా కనిపించిన వాళ్ళు, ఇప్పుడు ఎలా మంచిగా కనిపిస్తున్నారో బాబుకే తెలియాలి.
40 ఏళ్ల రాజకీయానుభవం ఉందని, దేశ రాజకీయాలను శాసించే శక్తి తనకుందని, ఢిల్లీలో చక్రం తిప్పిన చరిత్ర తనదంటూ గొప్పలు చెప్పుకునే బాబు కనీసం పట్టుమని పదేళ్ల రాజకీయానుభవం కలిగిన జగన్ మోహన్ రెడ్డి ని ఓడించటానికి, అతన్ని ఎదుర్కోవటానికి మరొకరి మీద ఆధారపడటం ఏంటి..? ఆయన గొప్పగా చెప్పుకుంటున్న అనుభవం, కృష్ణ నదిలో కొట్టుకుపోయిందా..? మూసీలో మునిగిపోయిందా..? నిజానికి రోజురోజుకూ మారుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలను చంద్రబాబు అంచనా వేయడంలో విఫలమవుతూనే ఉన్నాడు..
ఇప్పటికి పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు, పొమ్మనలేక పొగబెట్టటాలు లాంటివి ఇప్పుడు కుదరవు. అలాంటి రాజకీయాలు చేసే గత ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చెంది , ఇప్పుడు కనీసం పార్టీని కాపాడుకోలేని స్థాయికి చేరుకున్నాడు. 2014 లో బాబు లో పస తగ్గిపోయింది, అయితే అధికారంలో ఉండటంతో ఎలాగోలా బండిని లాకొచ్చాడు. 2019 లో కూడా గెలిచి ఉంటే ఆ పైత్యం ఇంకా ముదిరిపోయేది. అందులో ఓడిపోవటం, దానికి తోడు కులపెద్దల నుండి బాబు మీద ఒత్తిడి రావటంతో ఇక చేసేది ఏమి లేక రాబిన్ శర్మ ను తీసుకోని వచ్చాడు. ఇప్పటికే రాబిన్ శర్మ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను అర్ధం చేసుకునే పనిలో వున్నాడు. మరి టీడీపీ పార్టీని రాబిన్ శర్మ ఎంత వరకు బలపడేలా చేసి, వచ్చే ఎన్నికల నాటికీ పార్టీని విజయతీరాల వైపు నడిపిస్తాడో చూడాలి. ప్రస్తుతం చంద్రబాబు ఆశలన్నీ ఆయన మీదే ఉన్నట్లు అనిపిస్తున్నాయి.