స్టేజ్ మీదే అనసూయా పరువు తీసిన చలాకి చంటి..తెల్లమొహం వేసిన అనసూయా!

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి యాంకరింగ్ చేస్తూ పాపులర్ అయిన అనసూయ బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలకి యాంకర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ కామెడీ షో తో పాటు.. మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో లో సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తోంది. ఇక అనసూయ మరొకవైపు వరుస సినిమాలలో నటిస్తూ నటిగా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఓ పాత్రలో నటించిన అనసూయ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఇలా టీవీ షోలు, సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ తన అందాలతో రచ్చ చేస్తూ ఉంటుంది. ఈ వయసులో కూడా తన అందాన్ని మెయింటైన్ చేస్తూ.. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్ సంపాదించుకున్నాయి.. అంటే ఆమె ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా జబర్దస్త్ షో లో అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కామెడీ షో లో అప్పుడప్పుడు అనసూయ మీద కూడా పంచ్ లు వేస్తూ ఉంటారు.

ఇటీవల జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమో లో చలాకి చంటి అనసూయని తన అందం గురించి పొగుడుతూ.. అలాగే ఆమె అందం మీద సెటైర్ వేసాడు. దీంతో అనసూయ ఒక్కసారిగా తెల్లమొహం వేసుకుంది. ఈ ప్రోమోలో చలాకి చంటి మూలికలు అమ్మే వ్యక్తిగా కనిపించాడు.
ఈ క్రమంలో అనసూయ తన వద్దకు వచ్చి.. రోజురోజుకీ అందం పెరుగుతోంది అంటూ ఓ మూలిక ఇవ్వమని చంటిని అడిగిందట. చంటి ఇలా అనటంతో అనసూయ మురిసిపోయింది. తర్వాత చంటి మాట్లాడుతూ.. ఆమెకు ఓ మూలిక ఇచ్చాను.. దీంతో ఆమె అందం రోజురోజుకీ పెరుగుతోంది అనే భ్రమ తగ్గిపోయిందంటూ పరువుతీసేశాడు. ఇక ఆ పంచ్‌తో అనసూయ మొహం చిన్నబోయింది. మొత్తానికి అనసూయ ఈ వయసులో కూడా తన అందాన్ని మెయింటైన్ చేయటం కోసం చాలా శ్రమ పడుతోంది.