Home News బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన నాగ చైత‌న్య‌.. అక్క‌డే పాగా వేస్తాడా ఏమి?

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన నాగ చైత‌న్య‌.. అక్క‌డే పాగా వేస్తాడా ఏమి?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స్థాయి పెర‌గ‌డంతో బీటౌన్ ద‌ర్శ‌క నిర్మాత‌లు టాలీవుడ్‌పై చాలా ఫోక‌స్ పెడుతున్నారు. ఇక్క‌డి సినిమాల‌ని రీమేక్ చేయ‌డం లేదంటే మన స్టార్స్‌ని వారి సినిమాల‌లో న‌టించేలా అగ్రిమెంట్స్ చేసుకోవ‌డం వంటివి చేస్తున్నారు. మ‌రోవైపు మ‌న హీరోలు కూడా తాము తీసే సినిమాల‌ని దాదాపు పాన్ ఇండియా స్థాయిలో తీసి అందరి దృష్టిని త‌మ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైత‌న్య బాలీవుడ్ సినిమాలో ఓ క్రేజీ ఆఫ‌ర్ అందుకున్నాడ‌నే వార్త దావానంలా పాక‌గా, దీనిపై ఫ్యాన్స్ ఫుల్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Chai | Telugu Rajyam
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్ర‌స్తుతం హాలీవుడ్ చిత్ర రీమేక్‌గా లాల్ సింగ్ చ‌ద్దా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఇందులో కీల‌క పాత్ర కోసం ముందుగా విజ‌య్ సేతుప‌తిని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు అత‌నికి ఉన్న బిజీ షెడ్యూల్ వ‌ల‌న ఇందులో న‌టించే చాన్స్ లేదు. దీంతో ఆ పాత్ర‌కు నాగ చైత‌న్య అయితే కరెక్ట్ అని భావించి ఈ విష‌యంపై చైతూతో చ‌ర్చించార‌ట‌. అమీర్‌తో న‌టించే ఛాన్స్ రావ‌డంతో ఈ కుర్ర హీరో వెంట‌నే ఓకే అనేశాడ‌ని టాక్. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

నాగ చైత‌న్య ప్ర‌స్తుతం తెలుగులో ల‌వ్ స్టోరీ, థ్యాంక్యూ అనే సినిమాలు చేస్తున్నాడు. ల‌వ్ స్టోరీ చిత్రం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఇందులో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించింది. ఫ్రెష్ ల‌వ్ స్టోరీగా చిత్రాన్ని తెరకెక్కించగా, ఏప్రిల్ 16న మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. ఇక విక్ర‌మ్ కుమార్ ద‌ర్శకత్వంలోను చైతూ ఓ చిత్రం చేస్తున్నాడు. దీనికి థ్యాంక్యూ అనే టైటిల్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. 

- Advertisement -

Related Posts

కొడాలి నానికి బాలయ్య అంటే అంత భయమా.?

మంత్రి కొడాలి నాని, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ(బాలయ్య) మీద విమర్శలు చేసే క్రమంలో కొంత సంయమనం పాటిస్తుంటారు. ఎందుకు.? అంటే, దానికి చాలా కారణాలుంటాయనే చర్చ గుడివాడ నియోజకవర్గంలో తరచూ జరుగుతుంటుంది....

టీడీపీ కప్పులో తుపాను: తిట్టుకుంటారు, వీలైతే కొట్టుకుంటారు.!

టీ కప్పులో తుపానులా బెజవాడ తెలుగు తమ్ముళ్ళ మధ్య గొడవ చాలా తక్కువ సమయంలోనే చల్లారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారు. లేకపోతే, బుద్ధా వెంకన్న.. మాటకు కట్టుబడి...

టీడీపీ పతనానికి తనవంతు సాయం చేస్తున్న బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ పతనం అంచున కొట్టుమిట్టాడుతోంది చాలాకాలంగా. 'పార్టీ బాధ్యతల్ని మా బాలయ్యకు అప్పగించెయ్యండహో..' అంటూ నందమూరి వంశ వీరాభిమానులైన కొందరు టీడీపీ నేతలు ఎప్పటినుంచో నినదిస్తున్నారు. 'ఇంకా నయ్యం.. బాలయ్యకు పార్టీని...

Latest News