Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ జంట నిజ జీవితంలో కూడా ప్రేమలో పడిన అనంతరం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.వీరి వివాహం తర్వాత నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన సమంత నాగచైతన్య మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం చేత వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొని అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు.
ఇలా అక్టోబర్ 2వ తేదీ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం అభిమానులకు కాస్త బాధ కలిగించినా ప్రస్తుతం వీరిద్దరూ ఆ బాధను మరచి పోయి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. వీరిద్దరూ విడాకుల ప్రకటన అధికారికంగా చేసినప్పటికీ విడాకులకు గల కారణాలు ఏమిటి అనే విషయం పై ఇప్పటి వరకు స్పందించలేదు. సమంత విడాకుల తర్వాత తన మనసులో ఉన్న భావాలను బయట పెట్టినప్పటికీ చైతన్య మాత్రం ఒక్కసారిగా ఈ విషయంపై స్పందించలేదు.
తాజాగా నాగచైతన్య విడాకుల గురించి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ మేమిద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ఇద్దరికీ మంచి కోసమే ఈ నిర్ణయం.ఈ నిర్ణయం తర్వాత సమంత, నేను ఇద్దరం సంతోషంగా ఉన్నామని నాగచైతన్య విడాకులపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
