అవును.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అనేవి గల్లీ ఎన్నికలే. ఆ గల్లీ ఎన్నికల ఓట్ల కోసం ఢిల్లీ మొత్తం దిగిరానుందట. నమ్మశక్యంగా లేదు కదా. తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు రాలేదు. హైదరాబాద్ వరదలప్పుడు ఏ నాయకుడు రాలేదు. కానీ… జీహెచ్ఎంసీ ఎన్నికలు అనేసరికి.. ఢిల్లీ బీజేపీ నాయకులు మొత్తం హైదరాబాద్ లో లాండ్ అవుతున్నారు.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. కేంద్ర మంత్రులంతా హైదరాబాద్ కు తరలిరానున్నారట. కానీ.. ఎందుకు.. అనేదే ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న. హైదరాబాద్ లో వరదలు వస్తే ఏ కేంద్ర మంత్రి హైదరాబాద్ కు రాలేదు. కానీ.. హైదరాబాద్ లో ఎన్నికలు అంటే మాత్రం.. మొత్తం మంత్రులంతా హైదరాబాద్ కు తరలివస్తున్నారు.
ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి జవదేకర్ పాల్గొన్నారు. మరో యువ ఎంపీ తేజస్వీ సూర్య అయితే హైదరాబాద్ లోనే మకాం వేశారు. ప్రతిరోజు బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ పార్టీని ఎండగడుతున్నారు.
ఇప్పటికే మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్ లోనే మకాం వేసి హైదరాబాద్ ఎన్నికలను ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఇక కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, స్మృతి ఇరానీ.. ఇలా కేంద్ర మంత్రులంతా.. రేపో మాపో హైదరాబాద్ కు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారట. అయితే.. ఇక్కడ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక.. కేంద్ర మంత్రులంతా దిగుతున్నారా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం లేకనే బీజేపీ ఏకంగా ఢిల్లీ లీడర్లను దించుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏది ఏమైనా.. దుబ్బాకలో గెలిచినా కూడా గ్రేటర్ లో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం అనేది బీజేపీకి కష్టంతో కూడుకున్న పనే. అందుకే.. తెలంగాణ బీజేపీ నేతల వల్ల కాకనే… ఢిల్లీ లీడర్లను హైదరాబాద్ లో దించుతున్నారట. చూద్దాం మరి.. ఢిల్లీ లీడర్ల కష్టం అయినా ఫలిస్తుందో లేదో?