Ganesh Acharya: కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై లైంగిక వేధింపుల కేసు!

Ganesh Acharya: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తన కొరియోగ్రఫీ తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక టాలీవుడ్ లో కూడా గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాలో సమంతా స్పెషల్ సాంగ్ కు కూడా కొరియోగ్రఫి గా చేశాడు. ఇదంతా పక్కన పెడితే ఈయన పై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది.

తన వద్ద పనిచేసే ఒక మహిళ కొరియోగ్రాఫర్.. తనను లైంగికంగా వేధించాడని 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడని.. ఒప్పుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని నమోదు చేసింది. అంతేకాకుండా ఆమెపై గణేష్, ఆయన అసిస్టెంట్లు దాడి చేశారని.. పైగా తన కొరియోగ్రాఫర్ గుర్తింపును కూడా రద్దు చేశారని తెలిపింది. ఇక ఆమె లాయర్ ను కూడా సంప్రదించిందని.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలిసింది.