ఆడ, మగ తాళం వేసిన ఇంట్లో అలా ఉంటే .. అక్రమసంబంధం కాదట !

ఈ మధ్య కొన్ని కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఓ ఆడ, మగ ఇద్దరు తాళం వేసిన ఇంట్లో ఉంటే ఆది వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని స్పష్టం చేసింది. ఓ కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. 1998లో కే శరవణ బాబు అనే సాయుధ రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ తన క్వార్టర్‌లో మరో మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉండటాన్ని అధికారులు తప్పు పట్టారు. దీనితో వారి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడినందకు గాను అతడిని విధుల నుంచి తొలగించారు. దీనితో శరవణ బాబు కోర్టును ఆశ్రయించాడు.

 

Image result for chennai high court

కేసు విచారణ సందర్భంగా.. ” సమాజంలోని ఊహాతీత కథనాలను ఆధారంగా చేసుకుని క్రమశిక్షణా చర్యలు విధించడం, విధుల నుంచి తొలగించడం అనేది సరైనది కాదు. ఈ కేసులో శరవణ బాబు తన నివాసంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో ఉన్నాడు. అంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేం” అని వెల్లడించింది. అంతేకాక ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ని అభ్యంతరకర స్థితిలో చూసినట్లు ఒక్క ప్రతక్ష్య సాక్షి గాని, ఆధారాలు గాని లేవని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా శరవణ బాబు మాట్లాడుతూ.. సదరు మహిళా కానిస్టేబుల్‌ నివాసం.. నా క్వార్టర్స్‌ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఒకరోజు ఆమె ఇంటి తాళం కోసం నా నివాసానికి వచ్చింది. అప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం.. ఈ క్రమంలో ఎవరో తలుపు లాక్‌ చేశారు. దీనితో మేము ఎదో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు తట్టారు” అని తెలిపాడు.