Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు. సరైన సమయం చూసి జగన్మోహన్ రెడ్డి పై దెబ్బ కొడుతూ తన పంతం నెగ్గించుకున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చేశారనే విషయానికి వస్తే… జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిల మధ్య ఆస్తి వివాదాలు చోటు చేసుకున్న సమయంలో సరస్వతీ పవర్ భూముల గురించి చర్చలు వచ్చాయి.
ఇలా సరస్వతి పవర్ భూముల గురించి అన్నాచెల్లెల మధ్య వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సరస్వతి పవర్ భూములను సందర్శించారు. అయితే ఈ సరస్వతి పవర్ భూములన్నీ కూడా అక్రమంగా రైతుల నుంచి లాక్కొని జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులుగా చేసుకున్నారు అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాజశేఖర్ రెడ్డి హయామంలో అక్కడ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను లాక్కున్నారు. ప్రాజెక్ట్ ఏర్పడిన తర్వాత ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ భూములను తమ సొంత ఆస్తిగా మార్చుకున్నారని తెలిపారు.
ఇలా సరస్వతి పవర్ భూముల గురించి సంచలన విషయాలను బయటపెట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చారు. సరస్వతి పవర్ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను రద్దు చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ పవర్ భూములన్నీ కూడా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో పవన్ కళ్యాణ్ తిరిగి ఆ భూములను రీ సర్వే చేయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మొత్తం 24. 48 ఎకరాల భూమి ప్రభుత్వ, అసైన్డ్ భూమిగా తేలడంతో ఆ భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేశారు.