అవినీతిపై యుద్ధం కావొచ్చు..కక్ష సాధింపు కొవచ్చు..చట్టానికి ఎవరూ అతీతులు కాదు అని కావొచ్చు. తనలాగే వాళ్లకి జైలు జీవితం రుచి చూపించాలని కావొచ్చు. ఇలా జగన్ వ్యూహం ఏదైనా కావొచ్చు. కారణాలు ఏవైనా ..ఎన్నైనా..జగన్ టీడీపీపై శమరశంఖం పూరించారన్నది మాత్రం వాస్తవం. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ తో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే..అసలు సిసలైన సినిమా ముందుందని వైకాపా నేతలు వార్నింగ్ లతో వాతావరణం మరింత వేడెక్కుతోంది.
ఇప్పుడు తెలుగు రాష్ర్ట ప్రజల్లో ఇదే హాట్ టాపిక్. దీనిపై రకరకాల చర్చలు..వాదనలు..విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఇంకెత మంది జైలుకెళ్తారు? జగన్ దగ్గరనున్న లిస్ట్ లో టీడీపీ నేతలు ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వైకాపా తొలి నుంచి బలంగా వాదిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు ఓ సిట్ బృందం కూడా ఏర్పాటు జరిగింది. సీఐడీ కూడా వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ వివాదంలో ఇప్పటికే ఓ కలెక్టర్ ను కూడా అరెస్ట్ చేసారు. దీంతో ఇన్ సైడర్ ట్రేడింగ్ నిజమే అన్న సంకేతాలు బలబడ్డాయి.
తొలి నుంచి వైకాపా పెద్ద ఎత్తున టీడీపీ భూ కుంభకోణాలకి పాల్పడిందని చాలా బలంగా బాణీనిని వినిపించింది. నారా లోకేష్, మాజీ మంత్రులు యనమల కృష్ణుడు, నారయణ, పత్తిపాటి పుల్లారావు లపై బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమైతే ఈ నలుగురు బుక్కైనట్లే. నీటిప్రాజెక్ట్ ల టెండర్ల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అటు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతు వైకాపా మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది కూడా పెద్ద వ్యూహమే. చంద్రబాబు లాంటి దిగ్గజాన్ని అరెస్ట్ చేయాలంటే సీబీఐతోనే సాధ్యపడుతుంది. అందుకే సీబీఐనే రంగంలోకి దించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తుకు సీబీఐ రంగం సిద్దం చేస్తుంది.