జ‌గ‌న్ సామ్రాజ్యాన్ని చంద్ర‌బాబు ట‌చ్ చేయ‌గ‌ల‌డా?

జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్పాటై ఏడాది పాల‌న పూర్త‌యింది. మెనిఫెస్టో లో చెప్పిన సంక్షేమ ప‌థ‌కాల‌ను దాదాపు 90 శాతం పూర్తిచేసారు. ఇక మెనిఫెస్టో లో చెప్పుకోవాల్సిన అతి పెద్ద అంశం ఆయ‌న తీసుకొచ్చిన స‌చివాల‌యం, వార్డు ఉద్యోగాలు, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌. జ‌గ‌న్ సీఎం అవ్వ‌గానే స‌చివాల‌యం, వార్డు ఉద్యోగాలను ప‌ర్మినెంట్ ఉద్యోగాలుగా భ‌ర్తీ చేసారు. ల‌క్ష‌కు పైగా ఉద్యోగాల‌ను ఒకే నొటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేసి ఓ రికార్డునే న‌మోదు చేసారు. రెండేళ్ల త‌ర్వాత ఈ ఉద్యోగులంద‌రికీ ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం జీతాలివ్వ‌డం జ‌రుగుతుంది. ఇలాంటి భారీ జంబో నోటిఫికేష‌న్ గ‌తంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విడుద‌ల చేసారు. దాదాపు ల‌క్ష పోలీస్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసి ఓ సంచ‌ల‌న రికార్డునే క్రియేట్ చేసారు.

మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు తండ్రి త‌ర‌హా పాల‌న‌లో భాగంగా జ‌గ‌న్ ఆ దిశ‌గా రిక్రూట్ మెంట్లు చేప‌డుతున్నారు. ఇక జ‌గ‌న్ వాలంట‌రీ వ్య‌వ‌స్థ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు 4 ల‌క్ష‌ల మంది వాలంట‌రీ వ్య‌వ‌స్థ క్రింద‌కు తీసుకొచ్చి నెల నెలా మంచి జీతాలు అందిస్తున్నారు. నిజానికి ఈ వ్య‌వ‌స్థ రాష్ర్టంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. రేష‌న్ స‌హా ప్ర‌భుత్వానికి సంబంధించిన ఏ కార్య‌క్ర‌మాన్ని అయినా వాలంటీర్లే ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బ‌రువైన బాధ్య‌త‌ను అప్ప‌గించారు. వాలంటీర్లు అంద‌ర్నీ స‌చివాల‌యానికి అనుసంధానం చేసారు. ఈ రెండు రిక్రూట్ మెంట్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి హృద‌యం లాంటివిగా చెప్పొచ్చు. 2024 ఎన్నిక‌ల్లో ఈ వ్య‌వ‌స్థ అత్యంత కీల‌కంగా మార‌బోతుంది.

జ‌గ‌న్ ప‌థ‌కాలు స‌హా ఆయ‌న చేయాల్సిన కార్య‌క్ర‌మాల‌న్నింటిని ఈ వ్య‌వ‌స్థ ద్వారా సునాయాసంగా తీసుకెళ్ల‌గ‌ల‌రు. స‌చివాల‌యం, వార్డు, వాలంటీర్లు భ‌విష్య‌త్ లో ప్ర‌భుత్వానికి ఇంకా బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రించ‌నున్నాయి. ఆ దిశ‌గా జ‌గ‌న్ ప్ర‌త్య‌కంగా ప్ర‌ణాళిక సిద్దం చేసి పెట్టుకునే అవ‌కాశం ఉంది. ఆ అస్ర్తాన్ని స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ప్ర‌యోగించే ఛాన్స్ ఉంది. మ‌రి ఈ సామ్రాజ్యాన్ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు త‌న వైపుకు తిప్పుకోగ‌ల‌డా? అలాంటి వ్యూహం చంద్ర‌బాబు వేయ‌గ‌ల‌రా? అంటే చంద్ర‌బాబును త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. నాలుగు ద‌శాబ్ధాల రాజ‌కీయ‌ అనుభవం..మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం తో జ‌గ‌న్ సామ్రాజ్యాన్ని త‌న‌వైపుకు తిప్పుకునే బ‌ల‌మైన వ్యూహాన్ని ర‌చించే ఛాన్స్ అయింతే ఉంది. కానీ జ‌గ‌న్ సామ్రాజ్యం చంద్ర‌బాబు ను ఎంత వ‌ర‌కూ న‌మ్ముతారు? అన్న‌దే డౌట్. ఎందుకంటే మాట ఇస్తే మ‌డమ తిప్ప‌డం బాబుకు ఉన్న ఓ నైజం.