Butterfly: బటర్ ఫ్లై టీజర్ రిలీజ్.. మామూలుగా లేదుగా..?

Butterfly: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇక అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి లాంటి సినిమాలతో యూత్ కి మరింత చేరువ అయ్యింది. అనుపమ మొదటినుంచి నటనకి ఎక్కువ అవకాశం ఉన్న విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెళ్తుంది.ఇకపోతే అనుపమ హీరోయిన్ గా నటిస్తున్న తాజా సినిమా బటర్ ఫ్లై. జెన్ నెక్స్ట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు గంట సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

YouTube video player

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. తన ఇద్దరు చిన్నపిల్లలు కనిపించకపోవడంతో టెన్షన్ పడుతున్న సీన్స్ కట్ ఫై చేసిన టీచర్ అందరిలో ఉత్కంఠను పెంచుతోంది. ఇద్దరు పిల్లలు ఏమైపోయారు తెలుసుకోవడం కోసం ప్రయత్నానికి ఆమె పడే తాపత్రయానికి ఈ టీజర్ అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. అందులో భూమిక ఒక కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.