లక్కీ చామ్ బుట్టబొమ్మ: డార్లింగ్ ఫిక్సయిపోవచ్చిక.!

బుట్టబొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ అంటే, ఆ సినిమా సూపర్ హిట్టే అనే మాటకు అంతకంతకూ బలం చేకూరుతోంది. అప్పుడు వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడిన అల్లు అర్జున్‌కి ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో తిరుగులేని హిట్ దక్కిందంటే, ఆ క్రెడిట్‌లో పూజా హెగ్దేకి భాగం ఉందనడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పుడు, లేటెస్టుగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో అక్కినేని కుర్రోడు అఖిల్ కెరీర్ టర్న్ అవ్వడానికి కారణం బుట్టబొమ్మ. అందులో నో డౌట్ అంతే. అనూహ్యంగా ఈ సినిమా జనాదరణ పొందుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా లాంగ్ బ్యాక్ ఓవర్సీస్ మార్కెట్‌ని షేక్ చేసింది.

ఇక ఇప్పుడు ప్రబాస్ వంతొచ్చింది. ఈ సంక్రాంతికి ప్రబాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్ధే హీరోయిన్. ‘బాహుబలి’ సినిమా ప్రబాస్‌ని ప్యాన్ ఇండియా స్టార్‌గా మలిచింది. కానీ, ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ దక్కలేదు ప్రబాస్‌కి. భారీ అంచనాల నడుమ వచ్చిన ‘సాహో’ దారుణంగా నిరాశపరిచింది. సో, బుట్టబొమ్మ పుణ్యమా అని డార్లింగ్ కూడా సూపర్ హిట్టు కొడతాడా.? చూడాలి మరి.