Butta Bomma Pooja Hegde : ఆ ముగ్గురు స్టార్ హీరోస్ తో వర్క్ చెయ్యాలని ఓపెన్ అయ్యిన బుట్ట బొమ్మ.!

Butta Bomma Pooja Hegde :  ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో “బుట్ట బొమ్మ” అనే మాట వింటే మొట్ట మొదటిగా గుర్తు వచ్చే హీరోయిన్ ఎవరో అందరికీ బాగా తెలుసు. ఆమెనే పూజా హెగ్డే.. దాదాపు 90 సాతంకి పైగా ఆమె సినిమాలు హిట్ ట్రాక్ రికార్డు ఉండడంతో ఈమెని హీరోయిన్ గా పెట్టుకొని సినిమాలు తీయాలని నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
దీనితో హిట్ లేని హీరోలు కూడా హిట్స్ అందుకుంటున్నారు. దీనితో అనేక భారీ సినిమాలు ఆఫర్స్ తో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ లేటెస్ట్ గా నటించిన భారీ చిత్రం “రాధే శ్యామ్” విడుదలతో సిద్ధంగా ఉంది. మరి ఈమె వచ్చే ఆఫర్స్ కాకుండా ఈమెకి కూడా కొందరు హీరోస్ తో నటించాలని ఉంటుంది కదా..
అలా తాను ఏ హీరోస్ తో నటించాలి అనుకుంటుందో మనసులో మాటని ఇప్పుడు బయట పెట్టింది. మరి లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను కోలీవుడ్ స్టార్ హీరోస్ ధనుష్ తోని అలాగే ఉగల్ నయాగన్ కమల్ హాసన్ లతో సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది.
అలాగే హిందీలో అయితే స్టార్ హీరో రణబీర్ కపూర్ తో వర్క్ చెయ్యడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని ఓపెన్ ఆఫర్ చెప్పింది. మరి ఈమెకి ఆ హీరోలు అవకాశం ఇస్తారో లేదో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.