Bunny Vasu: జనసేన నుంచి పోటీపై స్పందించిన బన్నీవాసు….అలా చేస్తే పవన్ పక్కన పెట్టేస్తారంటూ?

Bunny Vasu: తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న వారిలో బన్నీ వాసు ఒకరు ఈయన త్వరలోనే తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్న బన్నీ వాసుకు జనసేన నుంచి పోటీ చేయడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈయన 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గోదావరి జిల్లాల నుంచి జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈయన పోటీ చేయకపోయినా గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ గెలవడానికి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ బన్నీ వాసును ఎన్నికల ప్రచార చైర్మన్గా కూడా నియమించిన సంగతి తెలిసిందే.

ఇలా గత ఎన్నికలలో జనసేన పార్టీ విజయానికి దోహదం చేసిన వారిలో బన్నీ వాసు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఎందుకని ఈ ఎన్నికలలో పోటీ చేయలేదు అంటూ మీడియా వారి నుంచి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు బన్నీ వాసు సమాధానం చెబుతూ… నాకు జనసేన నుంచి పోటీ చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ నాకు ఉన్న రెండు ఇబ్బందుల కారణంగా పోటీ చేయలేకపోయానని తెలిపారు.

ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్ మనం రాజకీయాలలోకి వెళ్ళాలి అంటే మన ఫ్యామిలీ పూర్తిగా ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నప్పుడే వెళ్లాలని అంతవరకు రాజకీయాలలోకి వెళ్ళకూడదని తెలిపారు. అదేవిధంగా నేను సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన తర్వాత తిరిగి వచ్చి సినిమాలు చేస్తానంటే కుదరదు పవన్ కళ్యాణ్ తో కలసి నడుస్తున్నాము అంటే మనం ఎన్నో కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే వాటన్నింటిని కూడా పాటించాల్సిన అవసరం చాలా ఉంది.

కళ్యాణ్ గారి లాంటి వ్యక్తితో జర్నీ చేస్తున్నప్పుడు కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆయన దగ్గర కమిట్మెంట్ లేకుండా పనిచేస్తే ఆయన పక్కన పెట్టేస్తారు అలా పక్కన పెట్టిన తర్వాత మరోసారి ఆయన దగ్గరికి వెళ్లలేము. అందుకే నేను అంత కమిట్మెంట్ ఇచ్చే సమయానికి, నేను ఇక్కడ అన్ని వదులుకొని ప్రజా జీవితంలోకి వెళ్లినా నాకు, నా ఫ్యామిలీలకి ఎలాంటి ఫైన్షియల్ ఇబందులు లేవు అనుకున్నప్పుడే రాజకీయాలలోకి వస్తానని బన్నీ వాసు తెలిపారు.