సుకుమార్ వల్ల కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్న బన్నీ?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అల్లు అర్జున్ రష్మిక నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టాయి.ఇకపోతే ఇందులో అల్లు అర్జున్ మేనరిజం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా వచ్చినటువంటి పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే షూటింగ్ పనులను ప్రారంభిస్తారనీ వార్తలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.ఇకపోతే ఈ సినిమా అనుకున్న విధంగా ఫిబ్రవరిలో షూటింగ్ పనులు ప్రారంభించి ఉంటే ఈ ఏడాది దసరాకు ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.ఇలా కనుక చేసి ఉంటే వచ్చే ఏడాది నుంచి అల్లు అర్జున్ తన తరువాతి ప్రాజెక్టులకు ఓకే చెబుతూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేవారు.

పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కావడానికి మరింత ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తన లుక్ మార్చుకోకుండా అలాగే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన తన తదుపరి ఎలాంటి ప్రాజెక్టులకు ఓకే చెప్పే అవకాశం లేకుండా పోయింది. తద్వారా బన్నీ భారీగానే నష్టపోతున్నారని సమాచారం. గత ఏడాది విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ఈ ఏడాది విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలయ్యే వరకు బన్నీ ఇతర ప్రాజెక్ట్స్ పక్కన పెట్టాల్సి వస్తుందని చెప్పాలి.