ఆ సీనియర్ యాక్టర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోవడానికి బుల్లెట్ భాస్కర్ కారణమా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారమౌతున్న జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ల ద్వారా ఎంతో మంది కమెడియన్లు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా జబర్దస్త్ పరిస్థితి దారుణంగా తయారయింది. జబర్దస్త్ యాజమాన్యం వారు వ్యవహరిస్తున్న తీరుతో విసిగి పోయిన కొంతమంది కమెడియన్లు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయారు. దీంతో ఈ షో రేటింగ్స్ చాలా దారుణంగా పడిపోయాయి. మునుపటిలా ప్రేక్షకులు ఈ షో చూడటానికి ఆసక్తి చూపటం లేదు.

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అదిరే అభి వంటి ప్రముఖ కమెడియన్లు జబర్ధస్త్ నుండి వెళ్ళిపోయారు. జబర్దస్త్ షో కి మూల స్తంబాళ్ళా ఉన్న ఉన్న వీరు వెళ్లిపోవడంతో జబర్ధస్త్ షో కి కల లేకుండా పోయింది. అయితే వీరు జబర్ధస్త్ నుండీ వెళ్ళిపోవటం పలు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన జబర్ధస్త్ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో ఇంద్రజ రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ ని తన ప్రశ్నతో టెన్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ప్రోమో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయానికి వస్తే.. ఆది, సుధీర్, శ్రీను వంటి వారితో పాటు సీనియర్ యాక్టర్ అప్పారావు కూడా ఈమధ్య జబర్ధస్త్ లో కనిపించటం లేదు. ఈ క్రమంలో జబర్ధస్త్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ స్టేజి మీదకు వచ్చి బుల్లెట్ భాస్కర్, రామ్ ప్రసాద్ ని కొన్ని ప్రశ్నలు వేసింది. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్ తో మాట్లాడుతు… మీ టీమ్ లో కో లీడర్ గా ఉన్న వ్యక్తిని మీరు తొక్కేయటం వల్లే ఆయన జబర్ధస్త్ నుండి వెళ్ళిపోయాడు అంటున్నారు. ఈ విషయంపై మీ సమధానం ఏమిటి అని ప్రశ్నించింది. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్ స్పందిస్తూ.. ఈ విషయం గురించి నేను మాట్లాడకూడదు అని అనుకున్నాను కానీ.. ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నాను అంటే వెళ్లిపోయిన వ్యక్తి చాలా పెద్దవారు అని చెప్తుండగా అతని మాటలు వినిపించకుండా మ్యూజిక్ తో కవర్ చేశారు. దీంతో భాస్కర్ ఏం సమాధానం చెప్తాడు అంటూ ప్రేక్షకులు ఆతృతగా ఎదరుచూస్తున్నారు.