ఆ విషయంలో రష్మి కన్నా సుధీర్ బెటర్ అంటున్న బుల్లెట్ భాస్కర్ తండ్రి..!

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో రష్మి గౌతమ్ కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతున్న రష్మికి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల రష్మి గురించి బుల్లెట్ భాస్కర్ తండ్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రష్మి ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ఈ షో మొగుడ్స్ పెళ్లామ్స్ అనే కాన్సెప్ట్‌తో వచ్చింది. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఆయన స్టేజ్ మీద బుల్లెట్ భాస్కర్ గురించి మాట్లాడుతు అతని పరువు తీసేసాడు. అంతే కాకుండా కుర్రాడిలా కబడ్డి ఆట ఆడి స్టేజ్ మీద నుండి పడిపోయాడు.

ఈ షో ద్వారా పాపులర్ అయిన బుల్లెట్ భాస్కర్ తండ్రి కొంచం ఛాన్స్ దొరికితే చాలు రష్మి , సుధీర్ ప్రేమ వ్యవహారం గురించి కౌంటర్లు వేస్తుంటాడు. తాజాగా జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్ తండ్రి రష్మి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అందరూ కలిసి స్టేజ్ మీదే కబడ్డీ గేమ్ ఆడారు. ఈ క్రమంలో ఆట చివర్లో మాత్రం పెళ్లామ్స్ టీం గెలిచిందంటూ రష్మీ చెప్పుకొచ్చింది. మేం ఏడుగురిని అవుట్ చేశాం.. వాళ్లు ఆరుగురినే అవుట్ చేశారు. వల్లెలా గెలుస్తారు అంటూ కౌశల్ అంటాడు. నేను ఒకేసారి ముగ్గురిని అవుట్ చేశాను కనుక మూడు పాయింట్లు అని కౌశల్ అంటే.. ఒకసారి ఎంతమందిని ఔట్ చేసినా ఒక పాయింటే అని రష్మీ అంటుంది. ఇలా వారిరిద్దరి మద్య గొడవ జరుగుతుంది.

బుల్లెట్ భాస్కర్ తండ్రి మధ్యలోకి వచ్చి కౌశల్ అందరినీ ఔట్ చేస్తే మీరే గెలిచారని చెప్తున్నావు. నువ్వు అసలు అంతా తప్పుగా చెప్తున్నావు. అసలు వాళ్ళు గెలిచారని చెప్పటానికి నువ్వు ఎవరు? అంటూ రష్మి మీద సీరియస్ అయ్యాడు. నువ్వు అసలు సరిగ్గా జడ్జిమెంట్ ఇవ్వటం లేదు. లేడి యాంకర్ ఉంటే ఇలాగే ఉంటుంది. అసలు నీ కన్నా ముందు నీ స్థానంలో ఉన్న ఆయన ఎక్కడ? వెళ్లి అతన్ని తీసుకురండి అంటూ ఫుల్ సీరియస్ అయ్యాడు. మొత్తానికి బుల్లెట్ భాస్కర్ తండ్రికి రష్మి యాంకరింగ్ నచ్చటం లేదు. అందువల్ల సుధీర్ ని తిరిగి శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి తీసుకురమ్మని చెప్తూ రెచ్చిపోయాడు.