లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం సహా పలు స్వచ్ఛంధ సేవా సంస్థలు, మంచు మనోజ్ లాంటి వారు చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఎన్ జీవోలు, సోషల్ మీడియా గ్రూపులు ఒకే తాటిపైకి వచ్చి వలస కూలీలను స్వస్థలాలకు తరలించే బాధ్యతను నెత్తిన వేసుకుని పనిచేస్తున్నాయి. మేడ్చల్ పరిధిలోని కొంత మంది కార్మికులను ఇలాగే తరలిస్తున్నారు. అయితే మధ్యలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దూరాడు. ప్రభుత్వ పెద్దలుతో మాట్లాడి,,బస్సులు, రైళ్లు వేయిస్తానని ఎవరు బాధపడాల్సిన పనిలేదని రెండు రోజుల క్రితం వలస కార్మిలకు క్యాంపుల దగ్గర హడావుడి చేసాడు.
అక్కడ పెడుతోన్న తిండి, నడిపిస్తున్న బస్సులు అన్నీ తానే సొంత డబ్బులతో వేసినట్లు బిల్డప్ కొట్టాడు. ప్రయివేటు వ్యక్తుల సమకూర్చిన బస్సుల్లోకి బలవంతంగా ఎక్కి జై తెలంగాణ..జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసాడు. దీంతో వలస కార్మికులంతా మీరే మా దేవుడన్నట్లు చూసారు. ఇలా ఎన్ జీవీల క్రెడిట్ ను తాను కొట్టాయాలని కన్నేసాడు. దీంతో నిర్వాహకులకు మండింది. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి మాదిరి మాసొంత డబ్బులతో బస్సులేసింది మేము. కార్మికుల్ని పంపిస్తుంది మేము..మధ్యలో మీ బిల్డప్ ఏంటి…బొండి లింగలా అంటూ మండిపడ్డారు. నేరుగా మంత్రితోనే కొందరు వాగ్వివాదానికి దిగడంతో సీన్ మారిపోయింది.
దీంతో బిల్డప్ బాబాయ్ బోడి లింగం ఊడిపోయింది. రెళ్లు విషయం పక్కనబెడితే ప్రభుత్వం నడుపుతోన్న ఆర్టీసీ బస్సులు రాష్ర్ట సరిహద్దులు వద్ద కార్మికుల్ని దించేసి వెళ్లిపోతున్నారు. అన్ని ప్రగల్భాలు పలికిన మంత్రిగారు ఇప్పుడేమైపోయారంటూ వలస కార్మికులు సరిహద్దు వద్ద ఆందోళన వ్యక్తం చేసారు. మంత్రి గారు గురించిన ఈ విషయాలు సోషల్ మీడియాకు ఎక్కడంతో ఆయనగారిపై కామెంట్లు పీక్స్ లో పడుతున్నాయి. బిల్డప్ బాబాయ్ బోడి లింగం ఊడిపోయిందంటూ ఫన్నీ కామెంట్లు పడుతున్నాయ్. బికామ్ లో ఫిజిక్స్ లా….గోదావరి నీళ్లు ముందుగా ఏపీలో చేరడంలా మల్లారెడ్డి ట్రోల్ అవుతున్నారు.