23 సీట్లు రావడం దేవుడి స్క్రిప్ట్.. అని విజయసాయిరెడ్డి అంటుంటారు కదా. మరి.. ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలను కొన్నాం.. అని ప్రకటిస్తున్నారు.. అంటే వచ్చే ఎన్నిక్ల్లో వైసీపీ గెలిచేది 5 సీట్లే అని ఫిక్సయినట్టే. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటు వింటుంటే కరోనా ఎఫెక్ట్ తో మైండ్ కూడా దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది.. అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ట్వీట్ చేశారు.
అంతే కాదు.. సిద్ధాంతాలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి.. అంటున్న విజయసాయిరెడ్డి.. ఇప్పటి వరకు రాజీనామా చేయకుండానే చేర్చుకున్న నలుగురు ఎమ్మెల్యేలను ఎంత పెట్టి కొన్నారో బయటపెట్టాలి.. అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు.
బుద్దా వెంకన్న ఎప్పుడూ వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తారని అందరికీ తెలిసిందే కదా. తాజాగా ఆయన ట్వీట్లతో వైసీపీపై విరుచుకుపడ్డారు.
2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీ… 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నది కదా. తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 23 సీట్లే కదా.. ఆ ఉద్దేశంలో వైసీపీ నేతలు టీడీపీపై సెటైర్లు వస్తుంటే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అలాంటి ట్వీట్ చేశారన్నమాట.
23 సీట్లు రావడం దేవుడి స్క్రిప్ట్ అనే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలను కొన్నాం అని ప్రకటిస్తున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలిచేది 5 సీట్లే అని ఫిక్సయ్యినట్టే. @VSReddy_MP మాటలు వింటుటే కరోనా ఎఫెక్ట్ తో మైండ్ కూడా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది.(1/2)
— Budda Venkanna (@BuddaVenkanna) October 2, 2020
సిద్ధాంతాలు,ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి అంటున్న వీసా రెడ్డి గారు ఇప్పటి వరకూ రాజీనామా చెయ్యకుండానే చేర్చుకున్న నలుగురు ఎమ్మెల్యేలను ఎంత పెట్టి కొన్నారో బయటపెట్టాలి.(2/2)
— Budda Venkanna (@BuddaVenkanna) October 2, 2020