ఏంటి బుచ్చిబాబు.. ఎన్టీఆర్ మీద అంత ప్రయోగం చేస్తున్నావా ?

Buchi Babu doing experiment on NTR

Buchi Babu doing experiment on NTR

ఈ ఏడాదిలో కొత్తగా వచ్చిన దర్శకుల్లో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నది బుచ్చిబాబే అనాలి. ‘ఉప్పెన’ సినిమాతో ఆయన సెన్సేషన్ సృష్టించాడు. ఏకంగా 50 కోట్ల షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు. దాదాపు ఇండస్ట్రీలో అందరి హీరోల ప్రశంసలు అందుకున్నాడు. సుకుమార్ అండ ఉండటంతో బుచ్చిబాబు రెండవ సినిమాను స్టార్ హీరోతో చేస్తున్నారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్. ప్రజెంట్ ‘ఆర్ఆర్ఆర్’ ముగించే పనిలో ఉన్న తారక్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. దాని తరవాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని అంటున్నారు.

అది పూర్తయ్యాక బుచ్చిబాబు సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ సమయంలోనే ఎన్టీఆర్ కు కథ చెప్పానని, అది ఆయనకు విపరీతంగా నచ్చిందని బుచ్చిబాబు అన్నారు. బహుశా ఆ కథనే సినిమాగా చేసే అవకాశం ఉంది. ఇక కథ విషయానికొస్తే అందులో పెద్ద ప్రయోగమే ఉంటుందని తెలుస్తోంది. ఇందులో తారక్ 60 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపిస్తాడని, సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని అంటున్నారు. ఇంతవరకు తారక్ మీద ఇలాంటి ప్రయోగం ఎవరూ చేయలేదు. కానీ బుచ్చిబాబు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడ కొంత ఎగ్జైట్ అవుతూనే ఇంకొంత షాకవుతున్నారు. బుచ్చిబాబు మొదటి సినిమాలోనే రిస్కీ ప్రయోగం ఒకటి చేశారు. అది బాగా వర్కవుట్ అయింది. మరి ఎన్టీఆర్ మీద కూడ అలాంటి ప్రయోగాన్నే వర్కవుట్ చేస్తారేమో చూడాలి.