బుచ్చిబాబు ఇంకో రెండేళ్లు ఎదురుచూడక తప్పదు

Buchhibabu should wait for 2 more years for NTR
Buchhibabu should wait for 2 more years for NTR
 
ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ చూసిన విజయాల్లో ‘ఉప్పెన’ కూడ ఒకటి.  డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.  ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకోవడంతో బుచ్చిబాబుకు స్టార్ హీరోల వద్దకు యాక్సెస్ దొరికింది.  దీంతో ఎన్నాళ్లగానో అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అయ్యారు బుచ్చిబాబు.  స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేశారు.  స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్నారు. 
 
అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రాజెక్ట్ అయితే ఖాయం అయింది.  ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగించి వెంటనే తన సినిమాను మొదలుపెట్టవచ్చని అనుకున్నారు.  కానీ ఈలోపు బ్రేకులు పడ్డాయి. 
 
ఎన్టీఆర్, బుచ్చిబాబు మధ్యలో కొరటాల శివ వచ్చి చేరారు.  ఆచార్య ముగియగానే ఆయన ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేస్తారు.  అస్సలు ఆలస్యం ఉండదు.  ఈ ప్రాజెక్ట్ ఫినిష్ కావడానికి ఇంకొక ఏడాది పడుతుంది.  అలాగని తారక్ అది అయిన వెంటనే బుచ్చిబాబుకు డేట్స్ ఇస్తారా అంటే అదీ లేదు.  దాని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. 
 
అది కంప్లీట్ అవ్వాలంటే ఇంకో ఏడాది పడుతుంది.  ఇలా మొత్తం ఎన్టీఆర్ ఫ్రీ అవ్వాలి అంటే రెండేళ్లు పట్టేలా ఉంది.  ఈ రెండేళ్లు బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఎదురుచూడాల్సిందే.  అందుకే ఈ గ్యాప్లో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయిన బుచ్చిబాబు కొత్త కథ పట్టుకుని హీరోలను అప్రోచ్ అవుతున్నారట.  త్వరలోనే ఆయన్నుండి కొత్త ప్రకటన వచ్చేలా ఉంది.