‘ఉప్పెన’ దర్శకుడికి హీరోలు ఇలా హ్యాండ్ ఇస్తున్నారేంటి ?

Buchchibabu Can Choose Small, Medium Range Heroes
బుచ్చిబాబు సాన.. మొదటి సినిమాతో ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. స్టార్ క్రేజ్ సంపాదించాడు.  కానీ రెండవ సినిమా పట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అలాగని నిర్మాతలు లేరా అంటే ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఆయనకు అడ్వాన్సులు ఇచ్చేశారు. కానీ హీరోలే దొరకట్లేదు బుచ్చిబాబుకి.  బుచ్చిబాబు రెండవ సినిమాను స్టార్ హీరోతోనే చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. అక్కడే వచ్చింది చిక్కు. స్టార్ హీరోలతో సినిమా అంటే అంత ఈజీ కాదు కదా.  బ్లాక్ బస్టర్ పడింది కాబట్టి కథ చెబుతాను అంటే వింటారు.  కానీ ఆ కథ కాస్త నచకపోయినా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ.  
 
సరిగ్గా ఇదే జరుగుతోంది బుచ్చిబాబు విషయంలో. గ్రాండ్ హిట్ కొట్టాడు కాబట్టి పలువురు హీరోలు ఆయన చెప్పే కథలు వింటున్నారు.  ఎన్టీఆర్ అయితే బుచ్చిబాబు కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూడ.  కానీ ఇతర కమిట్మెంట్స్ ఉండటంతో బుచ్చిబాబు సినిమా వెనక్కి వెళ్ళిపోయింది.  దీంతో బుచ్చిబాబు అంత కాలం ఎదురుచూడలేక వేరే ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు.  తన వద్ద ఉన్న కథల్లో ఒకదాన్ని తీసుకుని అల్లు అర్జున్ వద్దకు వెళ్లారట.  కానీ అల్లు అర్జున్ కు కూడ ఆ కథ అంతగా నచ్చలేదని, నో చెప్పారని అంటున్నారు. సో.. బుచ్చిబాబు పెద్ద హీరోలతోనే వర్క్ చేయాలనే పంతం వీడి చిన్న, మధ్యతరహా హీరోలను వెతుక్కుంటే త్వరగా ఏదో ఒక సినిమా సెట్టవ్వచ్చు.  అలా కాకుండా స్టార్ హీరోల వెంటే తిరిగుతాను అంటే మాత్రం సమయం వృథా తప్పదు. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles